Sports: క్రికెటర్ వార్నర్ బ్యాగ్ చోరీ.. ప్లీజ్ తిరిగి ఇవ్వండని రిక్వెస్ట్

Sports: Cricketer Warner's bag stolen.. Request not to return it please
Sports: Cricketer Warner's bag stolen.. Request not to return it please

ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బ్యాగ్ చోరీకి గురైంది. అయితే ఆ బ్యాగులో తనకు సంబంధించి చాలా విలువైన వస్తువులు ఉన్నాయని వార్నర్ వాపోతున్నాడు. అది ఎవరు తీసుకున్నా దయచేసి తిరిగి ఇచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇంతకీ ఆ బ్యాగ్ ఎలా చోరీకి గురైంది..? అందులో ఉన్న విలువైన వస్తువులు ఏంటంటే..?

జనవరి 3వ తేదీన సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం వార్నర్ మెల్బోర్న్ నుంచి సిడ్నీ వెళ్తుండగా అతడి బ్యాగ్ చోరీకి గురైంది. ఆ బ్యాగ్లో గ్రీన్ క్యాప్ (టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఇచ్చే క్యాప్), తన పిల్లల విలువైన వస్తువులు ఉన్నాయని ఆ బ్యాగ్ ఎవరు తీసినా తిరిగి ఇచ్చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాడు.

‘‘మెల్‌బోర్న్‌ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో లగేజ్‌ నుంచి నా బ్యాక్‌ప్యాక్‌ను ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయి. నా బ్యాగీ గ్రీన్ క్యాప్‌ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. దానిని ధరించి నా చివరి మ్యాచ్‌ ఆడాలనుకుంటున్నా. కావాలని ఎవరైనా బ్యాక్‌ప్యాక్‌ను తీసుకుంటే వారికి మరో బ్యాక్‌ప్యాక్‌ ఇస్తాను. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయను. ఎయిర్‌పోర్ట్, హోటల్ సిబ్బందిని కూడా అడిగాను. సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలించాం. ఎక్కడ దాని జాడ దొరకలేదు. దయచేసి నా బ్యాగీ గ్రీన్‌ క్యాప్‌ని తిరిగి ఇస్తే ఎంతో ఆనందిస్తా’’ అని వార్నర్ నెట్టింట పోస్టు పెట్టాడు.