‘ఒకే ఓవర్ లో 7 సిక్సర్లు’ కొట్టిన యువ క్రికెటర్…

Navindu pahasara hits 7 sixes in 1 over

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క్రికెట్లో బాట్స్ మన్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొడుతుంటే స్టేడియంలో ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు, ఇక ప్రతి మ్యాచ్ లో వారిపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు, ఆ క్రికెటర్లను తమ అభిమాన క్రికెటర్స్ గా ఆరాదిస్తారు. అసలు ఒకే ఓవర్లలో ఆరు సిక్సర్లు కొట్టటం అంటే మాటలు కాదు, చాలా కష్టం. ఇప్పటివరకు ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు కొట్టినవాళ్లు రవిశాస్త్రి, యువరాజ్‌ సింగ్‌, హెర్ష్‌లీ గిబ్స్‌, రవీంద్ర జడేజా. రవిశాస్త్రి, యువరాజ్‌ సింగ్‌, హెర్ష్‌లీ గిబ్స్ ఈ ముగ్గురు ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో ఈ ఘనత ను సాధించారు, కాని రవీంద్ర జడేజా మాత్రం సౌరాష్ట్ర టీ20 టోర‍్నమెంట్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు.

ఇప్పుడు వీరిని తలదన్నేలా శ్రీలంకకు చెందిన టీనేజర్‌ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఒకే ఓవర్ లో 6 బంతులు మాత్రమే ఉంటాయి కదా… మరి 7 సిక్సర్లు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా.? ఒకే ఓవర్ లో ఒక బంతి నోబాల్‌ కావడంతో ఆ కుర్రాడు ఏడు సిక్సర్లు కొట్టడం సాధ్యమైంది. ఇలా ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టడం ఏ ఫార్మాట్‌ క్రికెట్‌లో అయిన ఇదే తొలిసారి కావడం విశేషం. శ్రీలంకలో అండర్‌-15 మురళీ గుడ్‌నెస్‌ కప్‌ ఫైనల్లో భాగంగా ఎఫ్‌ఓజీ అకాడమీ తరఫున ఆడుతున్న నవీందు పహసర (89 బంతుల్లో 109) ఈ ఫీట్‌ సాధించాడు. నవీందు అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిపోవడంతో కొట్టావాపై ఎఫ్‌ఓజీ విజయం సాధించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఈ టోర్నమెంట్ ను లంక మాజీ స్పిన్నర్‌ మురళీధరన్‌ తన ఫౌండేషన్‌ తరఫున ఈ టోర్నీ ని నిర్వహిస్తున్నాడు.