శ్రీదేవి వద్దనుకున్న అద్బుత చిత్రాలు..!

Sridevi Rejected movies details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆమె అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దుబాయిలో వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి అక్కడ గుండె పోటు రావడంతో మృతి చెందింది. ఎన్నో అద్బుతమైన పాత్రలు చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీదేవి కెరీర్‌లో దాదాపు 300 చిత్రాలను చేసింది. ఆ చిత్రాల్లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు ఉన్నాయి. అప్పట్లో బిజీ షెడ్యూల్‌ వ్ల శ్రీదేవి పదుల సంఖ్యలో సినిమాలకు నో చెప్పాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, చిరంజీవి, కృష్ణ ఇలా ఎంతో మందికి కొన్ని సార్లు శ్రీదేవి నో చెప్పింది. అయితే శ్రీదేవి నో చెప్పగా బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రాలు రెండు ఉన్నాయి. ఆ రెండు చిత్రాల్లో శ్రీదేవి నటించి ఉంటే బాగుండేది అని ప్రేక్షకులు ఇప్పటికి అనుకుంటూనే ఉన్నారు.

హాలీవుడ్‌ దర్శకుడు స్టివెన్‌ స్పిల్‌బర్గ్‌ 1993లో జురాసిక్‌ పార్క్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రకు శ్రీదేవిని సంప్రదించడం జరిగింది. అప్పట్లో ఆ పాత్రను చాలా లైట్‌ తీసుకుని తాను నటించను అంటూ శ్రీదేవి చెప్పింది. ఆ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో నటించి ఉంటే శ్రీదేవి అంతర్జాతీయ స్థాయి స్టార్‌ అయ్యి ఉండేది. ఇక తాజాగా కూడా రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంలో శివగామి పాత్రను చేసేందుకు శ్రీదేవికి ఆఫర్‌ వచ్చింది. కాని శ్రీదేవి బాహుబలిని తక్కువ అంచనా వేసి ఆ పాత్రకు నో చెప్పింది. శివగామి పాత్రకు ఏ స్థాయి గుర్తింపు వచ్చిందో తెల్సిందే. ఈ రెండు చిత్రాలు చేసి ఉంటే శ్రీదేవి మరింత అత్యున్నత స్థితిలో ఉండేదనేది అభిమానుల ఆలోచన.