ఆ స్వామిని పిచ్చివాడు అనుకున్నవాళ్ళే పిచ్చివాళ్ళు.

subramanian swamy expectation on dinakaran proved in elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సుబ్రమణ్యస్వామి ఏది చేసినా సంచలనమే. సోనియా గాంధీ విద్యార్హత మొదలుకుని ఆయన ఏ విషయం టచ్ చేసినా కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. మేధావిగా పేరు పడ్డప్పటికీ ఆయన రాజకీయ పరిజ్ఞానం మీద ఎవరికీ నమ్మకం లేదు. అందుకే పాపం ఎన్ని ఏళ్ళు జనతా పార్టీ పేరుతో ఆయన రాజకీయం చేద్దామని చూసినా తమిళనాడు ప్రజలు పట్టించుకోలేదు. ఇక బీజేపీ లో చేరాక అయినా ఆయన రాజకీయ జాతకం మారిపోతుందని అంతా అనుకున్నారు. పేరుకి పార్టీలోకి తీసుకున్నప్పటికీ ప్రభుత్వ విధానాలపై సుబ్రమణ్యస్వామి కామెంట్స్ ని ప్రధాని మోడీ భరించలేకపోయారు. అందుకే ఆయన్ని పక్కనబెట్టారు. అయితే ఇలాంటి నిరాదరణలు స్వామికి కొత్త కాదు. అందుకే అధిష్టానం వైఖరి పట్టించుకోకుండా తనకు ఏమి అనిపించిందో అదే చెప్పడం చేస్తున్నారు.

dinakaran

జయ మరణం తర్వాత తమిళనాట రాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు జనం అన్నాడీఎంకేలో ఎవరిని నాయకుడిగా చూస్తున్నారు అన్నదానికి తలా ఒక మాట చెప్పారు. బీజేపీ హైకమాండ్ అప్పుడే పన్నీర్ సెల్వం ని నమ్ముకుంది. కానీ ఆయన కన్నా శశికళ అండ్ కో బెస్ట్ ఛాయస్ అని సుబ్రమణ్యస్వామి నెత్తినోరు కొట్టుకున్నారు. కానీ బీజేపీ లో ఆయన మాట ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ ఏమిటి దేశంలోని చాలా రాజకీయ పార్టీలు శశికళని విలన్ గా చూశాయి. మీడియా కూడా ఇందుకు అతీతం కాదు. అసలు మీడియానే మిగిలిన పార్టీల దగ్గర శశికళ ని దోషిగా నిలబెట్టింది. అయితే అటు మోడీ దగ్గర నుంచి ఇటు అన్నాడీఎంకేలో ప్రత్యర్థులంతా ఏకమైనా జయ వీడియో విడుదల అనే ఒక్క అస్త్రంతో శశికళ మేనల్లుడు దినకరన్ ఆర్కే నగర్ లో గెలుపు బాటలో నడిచారు. ఇదే విషయాన్ని సుబ్రమణ్యస్వామి అంతకు ముందు చాలా సార్లు చెప్పారు.

bjp-leader

శశికళ , దినకరన్ సామాన్యులు కాదని వాళ్ళు మాత్రమే జయ వారసత్వాన్ని నిలిపేలా అన్నాడీఎంకే ని నడపగలరని సుబ్రమణ్యస్వామి చెప్పినప్పుడు ఆ వర్గం మీద వరసపెట్టి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇంకేమనుకుంటారు జనం ..సుబ్రమణ్యస్వామిని పిచ్చివాడి కింద జమకట్టారు. ఇక బీజేపీ అయితే తమిళనాడు విషయంలో సుబ్రమణ్య స్వామి అభిప్రాయాన్ని లెక్క చేయలేదు. కానీ ఆర్కే నగర్ ఫలితం చూసాక ఆయన్ని పిచ్చవాడిగా జమకట్టిన వాళ్ళే పిచ్చి వాళ్ళు అయ్యారు.