క్రేజీ కాంబినేషన్ మూడోసారి..

sukumar bunny combination third time

‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కలయికలో హ్యాట్రిక్‌ సినిమా రాబోతున్నది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సుకుమార్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తిచేసినట్లు సమాచారం. త్వరలో ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. సుకుమార్‌ గత చిత్రాలకు భిన్నంగా వినూత్నమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణలో అల్లు అర్జున్‌ బిజీగా ఉన్నారు.