అశ్విన్‌, నిహారిక హ్యాపీ వెడ్డింగ్‌

Sumanth Ashwin and Niharika happy Wedding Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘ఒక మనస్సు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్‌ నిహారిక తాజాగా తన రెండవ సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. రెండవ సినిమా ఇంకా సెట్స్‌పైనే ఉంది. వచ్చే సంవత్సరం ఆరంభంలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా రెండవ సినిమా పూర్తి కాకుండానే అప్పుడే నిహారిక మూడవ సినిమాకు సైన్‌ చేసింది. ఈసారి ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా, మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే నిహారిక సినిమా ఉంటుందని అనిపిస్తుంది.

యూవి క్రియేషన్స్‌ బ్యానర్‌లో సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్‌గా నిహారిక ఎంపిక అయ్యింది. వీరిద్దరి జోడీ బాగా కుదిరిందని అప్పుడే సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక వీరిద్దరు కలిసి నటించబోతున్న సినిమాకు టైటిల్‌గా ‘హ్యాపీ వెడ్డింగ్‌’ను ఫిక్స్‌ చేయడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. సీనియర్‌ నరేష్‌, మురళి శర్మ, పవిత్ర లోకేష్‌, తులసిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందట. అక్టోబర్‌ 4న ఈ చిత్రాన్ని లాంచనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం సక్సెస్‌ నిహారిక మరియు అశ్విన్‌కు తప్పనిసరి. మరి ఈ చిత్రం వారికి సక్సెస్‌ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.