మెగా డాటర్ ‘హ్యాపీ వెడ్డింగ్‌’ రిలీజ్ డేట్… జూలై 28

niharika happy wedding Release Date

మెగా డాటర్ నీహారిక కొణిదెల, సుమంత్ అశ్విన్ ల హ్యాపీ వెడ్డింగ్‌కు పెళ్లి డేటు ఫిక్సయింది. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న హ్యాపీ వెడ్డింగ్ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సినిమాలో సుమంత్ అశ్విన్ ఆనంద్ గా, నిహారిక ‘అక్షర’ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. హీరో తండ్రి పాత్రలో నరేష్, హీరోయిన్ తండ్రి పాత్రలో మురళీశర్మ న‌టిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ సినిమా మొత్తం పెళ్లి కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయికి ఉండే కన్ఫ్యూజన్స్, ఫ్యామిలీ వంటి అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక, సినిమాలో సుమంత్ అశ్విన్‌, నిహారిక మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయట. ఈ చిత్రానికి థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా ఫిక్స్ చేశాయి. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.