ఆ హీరో 4 రోజులు జైల్లో ఉన్నాడట..

Sundeep Kishan Went To Jail For Nakshathram Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమా విడుదల సమయంలో ఆ చిత్రంలో నటించిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా అంతా కూడా తాము ఆ సినిమాకు అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం అంటూ చెబుతూ ఉంటారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతు కొన్ని సార్లు అతిగా కూడా చెబుతుంటారు. తాజాగా నక్షత్రం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ తాను సినిమాలో పాత్ర సంపూర్ణంగా రావాలనే ఉద్దేశ్యంతో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏకంగా నాలుగు రోజులు ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నక్షత్రం’ చిత్రంలో సందీప్‌ కిషన్‌ పోలీస్‌గా కనిపించాడు. ఇదే సినిమాలో మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ అతిథి పాత్రలో నటించాడు. సందీప్‌ కిషన్‌ ఈ చిత్రం కోసం దాదాపు సంవత్సర కాలం పాటు కష్టపడ్డాడట. ఎన్నో పోలీస్‌ సినిమాలు చూసి, ఎంతో మంది పోలీసులను ప్రత్యక్షంగా చూసి ఈ పాత్రను చేశాను అంటూ సందీప్‌ కిషన్‌ చెప్పడం కాస్త అతి అని మీడియా మిత్రులు చెవులు కొరుక్కుంటున్నారు. సినిమాల కోసం కష్టపడటం కామనే, అయితే నాలుగు రోజులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సందీప్‌ కిషన్‌ వారిని పరిశీలించాను అని చెప్పడం అబద్దం అయ్యి ఉంటుందని కొందరు అంటున్నారు. ఇంత కష్టపడి చేసిన సినిమాకు గొప్పగా స్పందన రావడం లేదు. యావరేజ్‌ టాక్‌ను ‘నక్షత్రం’ సినిమా దక్కించుకుంది.

మరిన్ని వార్తలు:

పవన్‌కు చిరు సలహా.. పట్టించుకుంటాడా?

నా గాడ్‌ ఫాదర్‌ దిల్‌రాజు

సమంత సొంత వ్యాపారం