సమంత సొంత వ్యాపారం

Samantha Starting New Business

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత త్వరలోనే అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతుంది. అక్కినేని వారు అంటే సినిమాతో పాటు వ్యాపారంలో కూడా ఆరితేరిన వారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగార్జున హీరోగా చేస్తూనే నిర్మాతగా, స్టూడియో అధినేతగా, కన్వెన్షన్‌ సెంటర్‌ ఓనర్‌గా, మాటీవీలో భాగస్వామిగా, రేసింగ్‌ జట్టు ఓనర్‌గా ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నాడు. అలాంటి అక్కినేని నాగార్జున ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న సమంత మాత్రం తక్కువ ఎలా ఉంటుంది. అందుకే సమంత పెళ్లికి ముందే అక్కినేని వారి కోడలు అనిపించుకునేందుకు వ్యాపారం షురూ చేసింది.

సమంత స్వయంగా ట్విట్టర్‌లో తాను కొత్త వ్యాపారం చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఎస్‌వీఎస్‌ పార్టనర్స్‌ ఎల్‌ఎల్‌పీ పేరుతో తన సంస్థను ప్రారంభించబోతున్నట్లుగా ఆమె పేర్కొంది. అయితే ఆమె చేయబోతున్న వ్యాపారం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. త్వరలోనే ఆ విషయాన్ని కూడా క్లారిటీగా చెబుతుందేమో చూడాలి. సమంత ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. అటు తమిళంలో ఈ అమ్మడు రెండు చిత్రాల్లో నటిస్తుంది. తెలుగు మరియు తమిళంలో బిజీ హీరోయిన్‌గా ఉన్న సమంత ఇలా ఒక్కసారిగా వ్యాపార రంగంలోకి జాయిన్‌ అవుతున్నట్లుగా ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చింది. సమంత వ్యాపారం సక్సెస్‌ కావాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ టు సమంత.

మరిన్ని వార్తలు:

ఈ వయస్సులో ముగ్గురు అవసరమా?

పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌