పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

Pawan Kalyan-Trivikram Srinivas' next movie first look release on august 15

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వచ్చిన విషయం తెల్సిందే. రెండు సినిమాలు కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను అందుకున్నాయి. ముఖ్యంగా అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని మొదటి నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్‌కు ఒక గుడ్‌ న్యూస్‌ను దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు.

ఇప్పటి వరకు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయలేదు. కనీసం సినిమా టైటిల్‌ ఏంటి అనే విషయాన్ని కూడా చెప్పలేదు. సినిమా షూటింగ్‌ పూర్తి కాబోతున్న సమయంలో ఇంకా టైటిల్‌ ప్రకటించకపోవడంపై ఫ్యాన్స్‌ కాస్త అసహనంతో ఉన్నారు. ఎట్టకేలకు సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టైటిల్‌పై కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. పలు టైటిల్స్‌ ప్రచారం జరిగాయి. కాని ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫైనల్‌ చేయలేదు. త్వరలోనే ఫైనల్‌ టైటిల్‌ను ఖరారు చేసి ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు నటిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు:

‘ఫిదా’ వల్ల చైతూ మూవీ ఆగింది

స్పైడర్‌ 16 కోట్లు.. జై లవకుశ 10 కోట్లు

నక్షత్రం ప్రివ్యూ.