ఈ వయస్సులో ముగ్గురు అవసరమా?

13JF513JF5274VuNthhwKkLrYyZW73smjSYAEen274VuNthhwKkLrYyZW73smjSYAEen

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రస్తుతం హీరోలు తమ సినిమాల్లో ఒక్క హీరోయిన్‌కు మాత్రమే ప్రిఫర్‌ చేస్తున్నారు. చాలా అరుదుగా ఇద్దరు హీరోయిన్స్‌ కనిపిస్తున్నారు. ఐటెం సాంగ్స్‌లో కాకుండా ఇద్దరు హీరోయిన్స్‌ను చూడటం ఇటీవల చాలా అరుదు అయ్యింది. అలాంటిది బాలయ్య 102వ చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలు మరియు ఒక ఐటెం సాంగ్‌కు మరో హీరోయిన్‌తో బాలయ్య కనిపించబోతున్నాడు. తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడము తెరకెక్కబోతున్న ఈ సినిమా నిన్ననే లాంచనంగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది.

సినిమాను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలనేది దర్శకుడి ప్లాన్‌గా తెలుస్తోంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో చకచక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కథానుసారంగా ముగ్గురు హీరోయిన్స్‌ను దర్శకుడు ఎంపిక చేయబోతున్నాడు. ఇప్పటికే నయనతారను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం మరో ఇద్దరు హీరోయిన్స్‌ను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసి, మరో హీరోయిన్‌ను టాలీవుడ్‌ ముద్దుగుమ్మను ఎంపిక చేయనున్నారు. ఇక ఐటెం సాంగ్‌ను తమిళ స్టార్‌ హీరోయిన్‌తో చేయించాలని భావిస్తున్నారు. మొత్తానికి బాలయ్య ఈ వయస్సులు ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేయబోతున్నాడు. అయితే బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు కనుక ముగ్గురు హీరోయిన్స్‌ను ఎంపిక చేసినట్లుగా కొందరు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు:

‘నేనే రాజు నేనే మంత్రి’ సెన్సార్‌ రిపోర్ట్‌.. అదిరిందట

దర్శకుడు…తెలుగు బులెట్ రివ్యూ.

నక్షత్రం తెలుగు బులెట్ రివ్యూ …