ఐటీలో ఈ ఉద్యోగాలు ఇక హుష్ కాకి.

HFS Research On Software Jobs Decrease Because Of Automation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో కంగు తిన్న ఐటీ రంగానికి ఆటోమేషన్ రూపంలో ఇంకో సవాల్ ఎదురు కానుంది. ఇప్పటికే ఉద్యోగుల భవిష్యత్ వూగిసలాడుతుండగా ఇక ఆటోమేషన్ వేగవంతం అయ్యే కొద్దీ రానున్న నాలుగేళ్లలో దాదాపు 40 లక్షల మంది కి షాక్ తగిలే అవకాశం ఉందట. ఐటీ రంగంలో పనిచేసే 40 లక్షల మంది ఆటోమేషన్ తో ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని అమెరికాకి చెందిన బిజినెస్ అడ్వైజరీ సంస్థ hfs రీసెర్చ్ అంచనా వేసింది. ఆటోమేషన్ వల్ల ఏ ఉద్యోగాలకి గండి పడుతుంది అన్నది కూడా ఈ సంస్థ చెప్పేసింది. దేశీయ ఐటీ వర్క్ ఫోర్స్ లో 14 శాతం మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఈ సంస్థ అభిప్రాయం. ముఖ్యంగా టెస్టింగ్ రంగం మీద ఆటోమేషన్ ప్రభావం ఎక్కువగా వుంటుందట.

ఐటీ రంగంలో మెడ మీద కత్తి వేలాడే జాబ్స్ జాబితా ఇదే …

* మాన్యువల్ టెస్టింగ్ …సాఫ్ట్ వేర్ టెస్ట్ ఇంజనీర్, మాన్యువల్ టెస్టర్, క్యూయే ఇంజనీర్
* ఇన్ఫ్రా స్ట్రక్చర్ మేనేజ్ మెంట్ ,…సిస్టమ్స్ ఇంజనీర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, ఐటీ ఆపరేషన్స్ మేనేజర్
* బీపీఓ …డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్
* సిస్టం మైన్టైనెన్సు…మైంటెనెన్సు ఇంజనీర్, సర్వర్ మైంటెనెన్సు.

మరిన్ని వార్తలు:

వైసీపీ ప్లాన్ లో రఘువీరా యాక్షన్ ?

కంభంపాటికి పదవీయోగం ఉందా..?