నా గాడ్‌ ఫాదర్‌ దిల్‌రాజు

Dil Raju is like my god father says sai Pallavi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మలయాళ ‘ప్రేమమ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఆ సినిమాతో సౌత్‌ ఇండియా మొత్తం ఈమె ఫ్యాన్స్‌ను ఏర్పర్చుకుంది. తాజాగా తెలుగులో ఈమె ‘ఫిదా’ చేసింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి నటనకు ఫిదా అవ్వని వారు ఒక్కరు కూడా ఉండరు, ప్రతి ఒక్కరు ఆ సినిమా చూసిన తర్వాత ఆమెకు ఫ్యాన్‌ అవ్వడం ఖాయం. అలాంటి అద్బుత నటన కనబర్చిన ముద్దుగుమ్మ సాయిపల్లవి వరుసగా మూడు సినిమాలను దిల్‌రాజు నిర్మాణంలోనే చేసేందుకు కమిట్‌ అయ్యింది. 

‘ఫిదా’ చిత్రం తర్వాత స్టార్‌ హీరోలు సైతం సాయి పల్లవితో నటించాలని కోరుకుంటున్నారు. పలువురు నిర్మాతలు సాయి పల్లవి ముందు చెక్‌లు పట్టుకుని నిలబడుతున్నారు. కాని సాయి పల్లవి మాత్రం ఏ నిర్మాతకు కమిట్‌ అవ్వడం లేదు. తెలుగులో వరుసగా మూడు సినిమాలు దిల్‌రాజు గారి బ్యానర్‌లో చేస్తాను, ఆయన నా గాడ్‌ ఫాదర్‌ అంటూ నిర్మాతలకు చెబుతుంది. తెలుగులో ఒక మంచి సినిమాతో సాయి పల్లవిని పరిచయం చేసినందుకు గాను దిల్‌రాజుపై ఆమె కృతజ్ఞతను చూపుతుంది. ఇలాంటి హీరోయిన్‌ చాలా అరుదుగా ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి సాయి పల్లవి ఇలా కూడా అందరి అభిమానాన్ని దక్కించుకుంది.

మరిన్ని వార్తలు:

పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌