సన్నీలియోన్ అందాల కోసం 3.25 కోట్లు ఇస్తున్న నిర్మాత…

Sunny Leone takes Big Remuneration for tamil Debut

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్ హాట్ బ్యూటీ మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్… ఇప్పుడు ఈ అమ్మడుకి ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు… గడిచిన సంవత్సరం గూగుల్ సెర్చింగ్ లో మొదటి ప్లేస్ లో ఉందంటే అర్ధం చేసుకోండి యూత్ లో ఆమె క్రేజ్ ఏంటో అని… సన్నీ లియోన్ చిన్న పాత్రలో అయిన లేక ఒక ఐటెం సాంగ్ లో అయిన నటింపచేస్తే అది ఖచ్చితంగా హిట్ అవుతుందని, కుర్రకారు ఆ సినిమాను ఆదరిస్తారని దర్శకనిర్మాతల నమ్మకం. అందుకే ఆమెకు ఎదో పాత్ర ను సృష్టించి వాళ్ళ సినిమాలలో నటింప చేస్తూ ఉంటారు. సన్నీ లియోన్ సినిమాలో ఉందంటే చాలు కుర్రకారు సినిమా కోసం ‘క్యూ’ కడతారు. ఎన్ని సార్లు చూసినా సన్నీ అందాలు చాలా కొత్తగా ఉంటాయని యూత్ లో ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని దర్శకనిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు.

Sunny-Leone

ప్రస్తుతం ఈ సెక్సీ సుందరి బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా బాగానే గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ మధ్య వచ్చిన రాజశేఖర్ గరుడవేగ మూవీ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సన్నీ లియోన్ ఐటెం సాంగ్ ఉండడంతో ఈ సినిమాకోసం యూత్ ఆసక్తి చూపించారు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకు సన్నీ లియోన్ సౌత్ లో స్పెషల్ సాంగ్స్ లలో మాత్రమే కనిపించింది గానీ పూర్తి స్థాయిలో నటించలేదు. కానీ ఇప్పడు సౌత్ మూవీ లో సన్నీ లియోన్ పూర్తి సినిమాలో కనపడబోతుంది.

Sunny-Leone-Tamil-Movie-ent

కోలీవుడ్ లో డైరెక్టర్ వడి వుడయన్ ఒక చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చారిత్రక చిత్రాన్ని ఒకే సారి తెలుగు, తమిళ్, మలయాళం మరియు హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని వడి వుడయన్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకు గాను ఈ సినిమాలో డైరెక్టర్ వడి వుడయన్ ఇండియా మొత్తం పేరు సంపాదించుకున్నా సన్నీ లియోన్ అయితే బాగుంటుంది అని ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సన్నీ లియోన్ యువరాణి పాత్రలో సరికొత్తగా కనిపించనుందట. అయితే ఒకేసారి నాలుగు భాషల్లో వస్తుండడంతో సన్నీ లియోన్ రూ.3.25 కోట్ల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందట. దీనికి నిర్మాత స్టీఫెన్ కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా సన్నీ లియోన్ అందాలని, క్రేజ్ ని ద్రుష్టిలో ఉంచుకొని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటివరకు సౌత్ లో ఐటెం సాంగ్ లతోనే కుర్రకారును మత్తెక్కించిన ఈ సెక్సీ బ్యూటీ, పుల్ లెంగ్త్ మూవీలో ఇంకా ఎలా మత్తెక్కిచిద్దో చూడాలి…