ఇప్పుడే బయోపిక్‌ వద్దులే

super star krishna gives clarity on his biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్‌ల సందడి కనిపిస్తుంది. ఇటీవలే ‘మహానటి’ చిత్రంగా సావిత్రి జీవిత చరిత్ర తెరపైకి వచ్చింది. మరో వైపు వెండి తెర ఇలవేల్పు, రాజకీయాల్లో సత్తా చాటిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ‘ఎన్టీఆర్‌’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మరో రెండు మూడు నెలల్లో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు. దాంతో పాటు ఏపీ మాజీ సీఎం రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ‘యాత్ర’గా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. కత్తి కాంతారావు జీవిత చరిత్ర కూడా తెరకెక్కబోతుంది. ఈ సమయంలోనే సూపర్‌ స్టార్‌ కృష్ణ జీవిత చరిత్ర సినిమాను కూడా తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా బయోపిక్‌ విషయమై చర్చ జరిగింది. తాజాగా సుధీర్‌బాబు ఈ విషయమై కృష్ణ వద్ద ప్రస్థావించాడు. మీ బయోపిక్‌ను డైరెక్ట్‌ చేయాలి అంటే ఎవరు చేస్తేబాగుంటుందని మీరు భావిస్తున్నారు అంటూ ప్రశ్నించిన సమయంలో నా బయోపిక్‌ విషయంలో ఇప్పుడే చర్చ ఎందుకు అంటూ కృష్ణ దాట వేశాడు. నా బయోపిక్‌ను డైరెక్ట్‌ చేయగల సత్తా ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో ఎవరికి లేనట్లుగా అనిపిస్తుంది అంటూ నవ్వేసినట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున కృష్ణ పుట్టిన రోజు వేడుకు జరిగాయి. ఎక్కువ శాతం కృష్ణ ఫ్యాన్స్‌ బయోపిక్‌ను కోరుకుంటున్నారు. కాని కృష్ణ మాత్రం ఆసక్తిగా లేడు. కృష్ణ ప్రకటనతో అభిమానులు కాస్త నిరాశ పడుతున్నారు