కేసీఆర్ ని పట్టుకుని ఏడ్చేసిన కృష్ణ

Krishna crying while holding KCR

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిన్న సాయంత్రం కృష్ణ నివాసంలో విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించారు. విజయనిర్మల భౌతికకాయంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను చూడగానే కృష్ణలో దుఃఖం కట్టలు తెంచుకుంది. కేసీఆర్ ను పట్టుకుని చిన్నపిల్లాడిలా విలపించారు. కృష్ణ అంతటి వ్యక్తిని ఆ స్థితిలో చూడాల్సి రావడం పట్ల కేసీఆర్ కూడా కదిలిపోయారు. ఆయన సైతం తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. బోరున విలపిస్తున్న కృష్ణను దగ్గరకు తీసుకుని సముదాయించారు. కన్నీరు మున్నీరు అవుతున్న కృష్ణను సీఎం ఓదార్చారు. సీఎం వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.