బిగ్ బ్రేకింగ్ : సుష్మా స్వరాజ్ కన్నుమూత

మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్(69) కన్నుమూశారు. ఛాతి నొప్పి రావడంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర మంత్రులు గడ్కరీ, హర్షవర్ధన్ తదితరులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మాకి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ షాలు సీట్ కూడా కేటాయించలేదు. ఆమె చాన్నాళ్ళగా ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సుష్మా స్వరాజ్.. ట్విటర్‌లో ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ యాక్టివ్‌గా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి బిల్లు తొలగింపు సందర్భంగా ఆమె చివరి సారి ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమితషాకు అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్ చేశారు.