సరిలేరు నీకెవ్వరూ మహేష్ బాబూ !

Sarileru neekevvaru mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు పుట్టినరోజు నేడు. నాలుగేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా ‘నీడ’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన మహేశ్‌బాబు 1983లో వచ్చిన ‘పోరాటం’ సినిమాలో తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించి మెప్పించారు.

తర్వాత బాలనటుడిగా శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడఛారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు చిత్రాల్లో నటించి మెప్పించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇటీవల తన 25వ చిత్రం ‘మహర్షి’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేశ్ మంచి హిట్ కొట్టారు. రైతుల సమస్యల ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను అలరించింది. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్‌‌కు మనమూ విషెస్ చెప్పేద్దామా..