కృష్ణ‌జింక‌లను కాల్చ‌మ‌ని టబు రెచ్చ‌గొట్టింది

Tabu Provocatives Salman Khan to do Killed deer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స‌ల్మాన్ ఖాన్ కృష్ణజింక‌ల కేసులో కొత్త విష‌యం వెలుగుచూసింది. ఈ కేసులో స‌ల్మాన్ కు శిక్ష విధించిన జోధ్ పూర్ న్యాయ‌స్థానం మిగిలిన న‌టీన‌టులు సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, నీల‌మ్, ట‌బు ల‌ను నిర్దోషుల‌గా ప్ర‌క‌టించింది. అయితే మిగిలిన వారి సంగ‌తేమో కానీ కృష్ణ జింక‌ల కాల్చివేత‌లో స‌ల్మాన్ తో పాటు ట‌బుకు కూడా ప్ర‌మేయ‌మున్న‌ట్టు ప్ర‌త్య‌క్ష‌సాక్షి ఒక‌రు వివ‌రించారు. స‌ల్మాన్ ఖాన్ కృష్ణ జింక‌ను వేటాడిన‌ప్పుడు జీపులో ఆయ‌న ప‌క్క‌నే ట‌బు ఉంద‌ని, ఆమె అత‌న్ని కాల్చ‌మ‌ని రెచ్చ‌గొట్టింద‌ని ప్ర‌త్య‌క్షసాక్షి న్యాయ‌స్థానానికి వెల్ల‌డించారు.

అయితే కేసులో ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం స‌ల్మాన్ త‌ప్ప మిగ‌తావారంద‌రినీ నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. అటు కోర్టు త‌న‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్ల‌డించ‌గానే..అక్క‌డే ఉన్న స‌ల్మాన్ ఖాన్ తీవ్ర ఉద్వేగానికి గుర‌య్యాడు. ఆయ‌న ప‌క్క‌నే ఉన్న చెల్లెళ్లు అర్పిత‌, అల్విరా ఖాన్ లు క‌న్నీరుమున్నీర‌య్యారు. ప్ర‌స్తుతం స‌ల్మాన్ జోధ్ పూర్ సెంట్ర‌ల్ జైలులో ఉన్నాడు. ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది వేసిన బెయిల్ పిటిష‌న్ పై కోర్టు శుక్ర‌వారం తీర్పు వెల్ల‌డించ‌నుంది.