కృష్ణ‌జింక‌ను కాల్చ‌లేదు… బిస్కెట్లు తినిపించి…. నీళ్లు తాగించాను

salman khan says he fed biscuits to deer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స‌ల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించిన నేప‌థ్యంలో స‌ల్మాన్ గ‌తంలో ఈ కేసు గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. స‌ల్మాన్ కృష్ణ జింక‌ల‌ను చంపినందుకు కోర్టు ఆయ‌న‌కు శిక్ష విధించ‌గా… ఆయ‌న మాత్రం మీడియాకు 2009లో మ‌రో క‌థ వినిపించాడు. తాను 1998 సెప్టెంబ‌ర్ 28న హ‌మ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ ముగించుకుని కోస్టార్ట్స్ తో బ‌య‌లుదేరాన‌ని, ఆ స‌మ‌యంలోనే త‌మ‌కు కృష్ణ జింక‌లు ఎదురుప‌డ్డాయ‌ని చెప్పుకొచ్చాడు. ఒక దానికి తాము బిస్కెట్లు తినిపించామ‌ని, అదే స‌మ‌యంలో ఓ జింక పొద‌లో ఇరుక్కోవ‌డం త‌మ‌కు క‌నిపించింద‌ని, అది తీవ్రంగా ఇబ్బందిప‌డుతుండ‌డం చూసి దానిని పొద‌లోనుంచి బ‌య‌ట‌కు తీశాన‌ని చెప్పాడు. అనంత‌రం దానికి కొన్ని నీళ్లు తాగించామ‌ని, త‌రువాత ఆ జింక కొన్ని బిస్కెట్లు తిని అడ‌విలోకి వెళ్లిపోయింద‌ని తెలిపాడు. అంతేగానీ తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌న్నాడు. స‌ల్మాన్ కు శిక్ష ప‌డ‌డంతో ఇప్పుడు నెటిజ‌న్లు ఆ వ్యాఖ్య‌ల వీడియో సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు.