సైరాలో నిహారికా ఏంటీ?

niharika konidela to play key role in sye raa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. నయనతార, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి ఇంకా పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు. వీరందరితో పాటు మెగా డాటర్‌ నిహారిక కూడా నటించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. నిహారిక ప్రస్తుతం హీరోయిన్‌గా రెండు మూడు సినిమాలు చేస్తోంది. ఈ సమయంలోనే తన పెద్దనాన్న సినిమాలో నటించాలని ఆమెకు చాలా కాలంగా కోరిక. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరబోతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నిహారిక నటించడం వల్ల సినిమా స్థాయి ఇంకా పెరుగుతుందనే ఉద్దేశ్యంతో పాటు, ఒక మంచి పాత్రకు నిహారిక అయితే బాగుంటుందనే అభిప్రాయంతో దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి సైతం నిహారిక ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అతి త్వరలోనే నిహారిక సైరా చిత్రీకరణలో పాల్గొనబోతుంది. చిరంజీవి చిత్రంలో నిహారిక కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచాలనేది చిత్ర యూనిట్‌ సభ్యుల అభిప్రాయం అని, ఆమె లుక్‌ను కూడా ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని సమాచారం అందుతుంది. అనధికారిక సమాచారం ప్రకారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూతురు పాత్రలో నిహారిక కనిపిస్తుందేమో చూడాలి.