చిరు మళ్ళీ ఆమెకే ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సైరా నరసింహా రెడ్డి చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాని స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార మెగాస్టార్ సరసన నటిస్తున్నది. సైరా సెట్స్ పైన ఉండగానే, కొరటాల శివ తో చిరంజీవి 152వ చిత్రాని రూపొందించాలని హీరో కం ప్రొడ్యూసర్ రామ్ చరణ్ భావిస్తున్నాడు. కొరటాల శివ సినిమా కోసం హీరొయిన్ ను వెతికే పనిలో ఉన్నారు కానీ చిరంజీవి వయసును దృష్టిలో ఉంచుకొని హీరోయిన్స్ ను సెట్ చేస్తున్నారు. చిరంజీవి సరసన హీరొయిన్ గా సైరా మూవీ లో నటిస్తున్నా నయనతార నే నటిస్తేనే బాగుంటుందని రామ్ చరణ్ అభిప్రాయపడుతున్నాడు. అందుకోసం ఆమెకు అధిక మొత్తంలో పారితోషకం, మరియు డేట్స్ తీసుకున్నారు.

నయనతార తెలుగులో స్టార్ హీరోస్ తో నటించింది సో ఆమె అయితేనే ప్రేక్షకులు యక్షప్ట్ చేస్తారు అనే ఆలోచన లేకపోలేదు. చిరంజీవి 150వ చిత్రం కోసం కూడా మొదట చాలా మంది హీరోయిన్స్ ను వెతికారు కానీ చివరాకరుకు కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు. కొరటాల శివలో మొదట కాజల్ ను అనుకున్నారు కానీ కాజల్ ప్రస్తుతం తమిళ, హింది చిత్రాలతో బిజీగా ఉన్నది కావున కాజల్ డేట్స్ సెట్ కాలేదు. చిరంజీవి సైరా నరసింహ రెడ్డి షూటింగ్ తో పాటుగా కొరటాల శివ సినిమా కూడా స్టార్ట్ కానున్నది. చిరంజీవి కూడా కుర్ర హీరోస్ తో పోటిపడి మరి సినిమాలు చేస్తున్నాడు.