కృష్ణ జింకల కేసులో సల్మానే దోషి, తేల్చేసిన కోర్టు

Jodhpur Court Sentenced Salman Khan in Black buck case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో రాజస్థాన్‌ జోథ్‌పూర్ కోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది. సల్మాన్‌ను కోర్టు నిర్దోషిగా తేలుస్తుందా, లేక దోషిగా తేలుస్తుందా ? దోషి అయితే శిక్ష ఏమిటి అనే ఉత్కంఠ కి తెర దింపింది కోర్టు. జోధ్‌పూర్ కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో సల్మాన్‌ ను కోర్టు దోషీగా తేల్చింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సల్మాన్‌ఖాన్‌ కు రెండేళ్ల జైలు శిక్ష విధించే అవ‌కాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. జింకల వేట కేసులో 20 ఏళ్ల తరువాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శిక్ష ఖారారైన తరువాత జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు సల్మాన్‌ను తరలించనున్నారు. అయితే ఇదే కేసులో ఉన్న సల్మాన్‌ఖాన్ మినహా సైఫ్ అలీఖాన్, టాబూ, సోనాలీ బింద్రే, నీలమ్‌లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.

అయితే కోర్టు తీర్పు నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ఆవరణలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 1998లో ‘హమ్ సాత్ సాత్ హైన్’ సినిమా షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్‌లోని కంకణి గ్రామంలో… అక్కడి గ్రామస్తుల సాయంతో సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్ కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది. సల్మాన్ మీద సెక్షన్-51 వన్య ప్రాణి సంరక్షణ చట్టం, సెక్షన్ 149-చట్ట విరుద్ద కార్యకలాపాలపై కేసులు నమోదయ్యాయి.