ఇండియన్‌ ఐడల్‌ను వదల్లేదుగా..!

Sri Reddy Reveals Whatsapp Chat With Indian Idol Singer Ramachandra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొంత కాలంగా తెలుగు నటి శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలకు సినీ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈమె చేస్తున్న విమర్శల తీవ్రత పెరుగుతూ వస్తుంది. మొన్న శేఖర్‌ కమ్ములపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా నానిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నేచురల్‌ స్టార్‌ అంటూ నాని పేరు పెట్టకుండా ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈమె ఇండియన్‌ ఐడల్‌ శ్రీరామ చంద్రపై షాకింగ్‌ ఆరోపణలు చేసింది.

గతంలో శ్రీరామ చంద్రకు తనకు మద్య జరిగిన వాట్సప్‌ ఛాటింగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. స్క్రీన్‌షాట్స్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన శ్రీరెడ్డి ఈయన ఇండియన్‌ ఐడెల్‌ ఎలా అయ్యాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఛాటింగ్‌లో శ్రీరెడ్డితో శ్రీరామ చంద్ర అసభ్యంగా ప్రవర్తించినట్లుగా ఉంది. ఆమె హాట్‌ పిక్స్‌ పంపించాలని కోరడం జరిగింది. అయితే ఈ చాటింగ్‌ ఎంత వరకు నిజం అనే విషయం తెలియాల్సి ఉంది. శ్రీరామ చంద్ర గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే శ్రీరామ చంద్ర అలాంటి వాడు కాదని, ఆయన ఆడవారితో అలా ప్రవర్తించడు అంటూ సన్నిహితులు చెబుతున్నారు. శ్రీరెడ్డి పోస్ట్‌ చేసిన వాట్సప్‌ ఛాటింగ్‌ గురించి ఇప్పటి వరకు శ్రీరామ చంద్ర స్పందించలేదు. ఆయన ఎలా స్పందిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.