ఆ ఫ్యామిలీని ఇంకా వదలని శ్రీరెడ్డి

sri reddy another time comments on daggubati abhiram

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీరెడ్డి లీక్స్‌ ఇప్పట్లో ఆగే పరిస్థితి కనపడటం లేదు. మా వారు బ్యాన్‌ను ఎత్తి వేసిన తర్వాత శ్రీరెడ్డి కాస్త వెనక్కు తగ్గే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే శ్రీరెడ్డి మాత్రం తాను మొదలు పెట్టిన పోరాటం ఆపే ప్రశక్తే లేదు అంటూ తేల్చి చెబుతుంది. భారీ ఎత్తున ఆమె స్టార్స్‌పై ఆరోపణలు చేస్తూనే ఉంది. దగ్గుపాటి సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌పై ఆమె చేసిన ఆరోపణలు తారా స్థాయికి చేరాయి. ఆమె ఏకంగా ఫొటోలు మరియు చాట్‌ కూడా లీక్‌ చేయడంతో చర్చనీయాంశం అయ్యింది. మొదట శేఖర్‌ కమ్ముల గురించి ఆ తర్వాత నాని, వైవా హర్షల గురించి ఆరోపణలు చేసిన ఈ అమ్మడు వారి విషయాన్ని పక్కకు పెట్టేసింది.

అభిరామ్‌పై కూడా విమర్శలు చేసి వదిలేస్తుందని అంతా భావించారు. కాని శ్రీరెడ్డి అభిరామ్‌ను ఇప్పట్లో వదిలేలా లేదు. ఇటీవల అభిరామ్‌పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. రామానాయుడు స్టూడియోను అడ్డు పెట్టుకుని అభిరామ్‌ వందలాది మంది అమ్మాయిల జివితాలుతోఆడుకున్నాడని, వాడి అకృత్యాలకు ఎంతో మంది అమ్మాయిలు బలి అయ్యారు. వారందరికి న్యాయం చేయాలి, రామానాయుడు స్టూడియో నుండి వాడిని పంపించి వేసి, రామానాయుడు స్టూడియోను ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని శ్రీరెడ్డి డిమాండ్‌ చేసింది. అభిరామ్‌పై ఆరోపణలు చేయడానికి ముందు పలువురిపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అంతగా పబ్లిసిటీని దక్కించుకోలేదు. అభిరామ్‌పై ఆరోపణలు చేసినప్పుడు మాత్రమే అసలు ఆట మొదలైంది. దాంతో ఆమె దగ్గుబాటి ఫ్యామిలీని ఇప్పట్లో వదిలేలా లేదని సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.