పూనం పంజా దెబ్బ… పద్మవ్యూహంలో పవన్ ?

Pawan Kalyan tension over Poonam Kaur ABN Interview

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పూనం కౌర్… తెలుగులో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించినా ఆమె పెద్దగా పాపులర్ అవ్వలేదు. కాని ప్రస్తుతం సినిమాలు ఏమీ లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఆమె హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సినిమాలలో నటిస్తున్నా, నటించకపోయినా ఆమె మీద పెద్దగా మీడియా కూడా ఫోకస్ చేసేది కాదు. అయితే ఎప్పుడయితే పవన్ కళ్యాణ్ తో పూనం కౌర్ ని కలిపి కత్తి మహేష్ ఆరోపణలు చేశాడో అప్పటి నుండి పూనం కౌర్ మీద ఒక్కసారిగా మీడియా ఆసక్తి పెరిగింది. అయితే నిన్ననే ఎబిఎన్ ఛానల్ ఒక ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేసింది. పంజాబీ పంజా పేరుతో విడుదలైన ఈ వీడియో ప్రోమో చూస్తుంటే పూనం కౌర్ తో ఎబిఎన్ ఛానల్ ఇంటర్వ్యూ పెద్ద దుమారమే రేపేట్టు కనపడుతోంది.

“ప్రశ్నించడం మొదలైంది ” అన్న వాక్యంతో ఈ ట్రైలర్ ముగించడం చూస్తుంటే పూనం కౌర్ మెయిన్ రోల్ లో పవన్ మీద ఏమైనా గేమ్ మొదలయిందా అనే సందేహం తప్పక కలుగుతోంది. ముందు నుండి జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే కత్తి మహేష్ ఈ పవన్-పూనంలను ముడి పెట్టి కొన్ని ప్రశ్నలు సంధించినా పవన్ దాని మీద నోరు విప్పలేదు. తర్వాత జరిగిన పరిణామాల వల్ల కత్తి మహేష్ కి, పవన్ ఫ్యాన్స్ కి మధ్య నలుగుతున్న వివాదం సమసిపోయింది. అయితే ఎప్పుడయితే పవన్ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జనసేన ఆవిర్భావ సభలో తెలుగుదేశం మీద దాడి ప్రారంభించిన పవన్ తెలుగు దేశం శ్రేణులు సోషల్ మీడియా లో పవన్-పూనం వ్యవహరం మీద మాట్లాడితే అస్సలు నోరు విప్పడం లేదు. ఇదే కాక ప్రత్యేక హోదా అనే విషయం మీద కూడా ముందు నుండి పోరాటం చేస్తానంటున్న పవన్ ఈ వ్యవహారం బయటకి వచ్చినప్పటి నుండి పవన్ కాస్త తగ్గి మాట్లాడుతున్నాడు. దీంతో పవన్ మీద వ్యతిరేకులకి అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ఎప్పుడయితే పవన్ – పూనం వ్యవహారం బయటకి వచ్చిందో అప్పటి నుండి పూనం ట్విట్టర్ ని గమనిస్తున్న వారికి పవన్ పూనం ల మధ్య ఎదో ఉందన్న అనుమానం కలుగక మానదు. ఎందుకంటే మహిళలకి సంబంధించి పవన్ చేస్తున్న అన్ని కార్యక్రమాలకి ఆమె కౌంటర్ ఇస్తూనే ఉంది, ఎంతో అట్టహాసంగా పవన్ కళ్యాణ్ ‘వీర మహిళ’ కార్యక్రమాన్ని ల్యాప్ టాప్‌లో బటన్ ప్రెస్ చేసి ప్రారంభించిన కాసేపటికే పూనం కౌర్ కౌంటర్ ట్వీట్ చేసింది ‘ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ వాట్ విమెన్ ఎంపవర్‌మెంట్ రియల్లీ మీన్స్?’ అంటూ పూనం కౌర్ ట్వీట్ చేసింది ఇది ఒక ఉదాహరణ మాత్రమే పవన్ చేసిన ప్రతి దానికి ఆమె కౌంటర్ ఇస్తూనే ఉంది. అయినా పవన్ ఎక్కడా నోరు విప్పక పోవడం చూస్తే మరెన్నో అనుమానాలకి తావిస్తోంది.

ఇదంతా పక్కన పెడితే గత కొద్దిరోజులుగా పవన్ జనసేన కి బాబు తెలుగుదేశానికి పొసగడం లేదు, ఎన్నికల్లో ఇక సమరమే అనుకుంటున్నా సమయంలో తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానెల్ అనిపించుకునే ఏబీఎన్ ఛానల్లో ఈ ప్రోగ్రాం రానుండడంతో ఎటువంటి సంచలనాలకు తెరలేవనుందో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అదీ కాక ప్రోమోలో వాడిన ” తుఫాను ముందు ప్రశాంతత”, “సమయం కోసం వేచిన సమరం “, “ప్రశ్నించడం మొదలైంది” లాంటి పదాల్ని బేస్ వాయిస్ లో చెప్పించి మరీ ట్రైలర్ వదలడం చూస్తుంటే అసలు ఇంటర్వ్యులో కొంపలు మునిగే అంశమే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూ ప్రసారం అయిన తర్వాత పవన్ కి ఇబ్బందులు తలెత్తితే ఇప్పటిదాకా ఆయన చెప్పిన నీతి వాఖ్యాలని, చెప్పిన ఆయన్ని జనం అసహ్యించుకునే అవకాసం లేకపోలేదు. నిజంగా వారి మధ్య ఏదైనా ఉండి ఈ ఇంటర్వ్యు ద్వారా గనుక బయటపడితే ఒక రకంగా పవన్ ది పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడి పరిస్థితి ఖాయం, అక్కడ అభిమన్యుడు చావు, ఇక్కడ పవన్ కి రాజాకీయ సన్యాసం. అయితే అసలు ఇంటర్వ్యూలో ఏముందో తెలుసుకోవాలి అంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.