ఇండస్ట్రీ బాగోతం బయట పెట్టిన వర్మ

varma comments on industry over casting couch

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొంత కాలంగా ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంగా హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతున్న సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మ ఆ హీట్‌కు ఆజ్యం పోసే విధంగా వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీ పరువును తీశాడని కొందరు సినీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండి, ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహారం జరుగుతుందని బల్లగుద్ది మరీ చెప్పడం ప్రస్తుతం విమర్శలు లేవనెత్తుతుంది. వివాదాల దర్శకుడు వర్మ చేసిన కాస్టింగ్‌ కౌచ్‌ వ్యాఖ్యలు గత కొంత కాలంగా పలువురు చేస్తున్నవే. కాని వర్మ చేయడం వల్ల వాటి ప్రాముఖ్యత పెరిగింది.

ఇంతకు వర్మ ఏమన్నాడంటే.. ఇండస్ట్రీలో కో ఆర్డినేటర్లు అని ఉంటారు. వారు అమ్మాయిలను దర్శకులకు పరిచయం చేయాల్సి ఉంటుంది. ఒక దర్శకుడికి హీరోయిన్‌ లేదా నటీ నటులు కావాలి అంటే కో ఆర్డినేటర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఆ కో ఆర్డినేటర్‌ అచ్చు బ్రోకర్‌ మాదిరిగా వ్యవహరిస్తాడు. బ్రోకర్‌గా కోఆర్డినేటర్‌ అమ్మాయిలను దర్శకుల వద్దకు తీసుకు వెళ్తాడు. దర్శకులకు కో ఆర్డినేటర్‌ అమ్మాయిల ఫొటోలు, లిస్ట్‌ పంపితే అందులో కాంప్రమైజ్‌కు ఓకే చెప్పే అమ్మాయిలను పక్కకు పెడతారని, ఆ అమ్మాయిలు కొన్ని సార్లు కో ఆర్డినేటర్‌లతో కూడా కాంప్రమైజ్‌ అవ్వాల్సి ఉంటుందని వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ ఇంత బాహాటంగా చెప్పడంతో ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ఏ రేంజ్‌లో ఉందో తెలిసి పోతుందని కొందరు ఆడవారు అంటున్నారు.