వంగవీటికి జగన్ పొగ పెట్టినట్టే.

Ys Jagan doesn't give priority to Vangaveeti Radha

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పుండు మీద కారం చల్లడం తో ఎలా ఉంటుందో ఇప్పుడు విజయవాడ వైసీపీ రాజకీయాల్లో ఒంటరి అయిన వంగవీటి రాధా కి ప్రత్యక్షంగా అనుభవం అవుతోంది. వెల్లంపల్లి శ్రీనివాస్, విష్ణు, యలమంచిలి రవి లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకురావడం తో వంగవీటి రాధా వైసీపీ లో తనకు ప్రాధాన్యం తగ్గిపోతుందని ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో వంగవీటి రంగ గురించి చేసిన కామెంట్స్ కి సంబంధించి పార్టీ నుంచి బహిష్కరణకు గురి అయిన గౌతమ్ రెడ్డి ని తిరిగి పార్టీలోకి తీసుకోవడం రాధాని తీవ్రంగా హర్ట్ చేసిందట. ఈ నిర్ణయంతో రాధకి పార్టీలో ఉంటే వుండండి లేకుంటే పోండి అని జగన్ పరోక్షంగా చెప్పినట్టే ఆయన ఫీల్ అవుతున్నారట.

వైసీపీ వ్యవహారశైలి చూసిన రాధా త్వరలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందట. ఆయన జనసేన లేదా టీడీపీ లో చేరే అవకాశం ఉందని విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న మాట. కొడాలి నాని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సఫలం అయ్యే ఛాన్స్ లేదట.