వినాయక్‌ కథ కంచికేనా?

VV vinayak next planning on balakrishna

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు వివి వినాయక్‌ కెరీర్‌ ఖతం అయినట్లేనా అంటూ సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత సంవత్సరం చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ చిత్రంతో వినాయక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ దక్కించుకుంది. అయితే ఆ విజయంలో కనీసం 10 శాతం అయినా వినాయక్‌కు దక్కలేదు. మొత్తం క్రెడిట్‌ అంతా కూడా చిరంజీవికి దక్కింది. అది తమిళ చిత్రం అవ్వడంతో వినాయక్‌ గొప్పదనం ఏమీ లేదని, ఉన్నది ఉన్నట్లుగా దించేశాడు అంటూ వినాయక్‌పై కామెంట్స్‌ వినిపించాయి. ఖైదీ నెం.150కి ముందు అఖిల్‌ చిత్రాన్ని తెరకెక్కించి అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు.

అఖిల్‌ అంచనాలు తారు మారు అవ్వడం, ఖైదీ నెం.150 చిత్రం పెద్దగా పేరు తీసుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న హీరో అయిన సాయి ధరమ్‌ తేజ్‌తో సినిమాను చేశాడు. వినాయక్‌ తెరకెక్కించిన మెగా ఇంటిలిజెంట్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఆ చిత్రం వినాయక్‌ కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టేసింది. స్టార్‌ హీరోలతో పాటు సెకండ్‌ గ్రేడ్‌ స్టార్స్‌ కూడా వినాయక్‌ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమయంలోనే నిర్మాత సి కళ్యాణ్‌ను పట్టుకుని బాలకృష్ణతో ఒక చిత్రాన్ని చేయాలని వినాయక్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. వినాయక్‌ గతంలో బాలయ్యకు సూపర్‌ హిట్‌ ఇచ్చాడు. ఆ నమ్మకంతో బాయ్య ఓకే చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒక వేళ బాలయ్య ఆఫర్‌ ఇవ్వకపోయినా లేదా బాలయ్యతో చేసిన చిత్రం కూడా ఫెయిల్‌ అయితే వినాయక్‌ కథ ఇక కంచికే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.