శ్రీ రెడ్డి కి పవన్ సలహా !

Pawan Kalyan advice to Sri Reddy Over Casting Couch

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా జనాల నోళ్ళలో నానుతున్న అంశం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంశం. శ్రీ రెడ్డి లేవనెత్తిన ఈ అంశం ఎన్నెన్నో మలుపులు తిరిగి ఎప్పటి నుండో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాతుకు పోయిన కొందరు పెద్దల భాగోతాలు సైతం బయటకు వస్తున్నాయి. అయితీ ఈ పోరాటంలో శ్రీ రెడ్డి పవన్ తనకి మద్దతు ఇవ్వాలని సినీ ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద ఆయన కూడా స్పందించాలని కోరింది. అయితే ఎంతో మంది ఎన్నో విషయాల మీద ఇలాగే స్పందించాలని కోరినా స్పందించని పవన్ ఈ విషయం మీద స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ విషయం మీద స్వయంగా అయితే పవన్ స్పందించేవారో లేదో తెలిదు కానీ ఈరోజు స్పందించాల్సిన పరిస్థితి వచ్చి స్పందించారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న దివ్యాంగుల క్రికెట్‌ టోర్నీకి ముఖ్య అతిధి గా వచ్చిన ఆయన టోర్నీని ప్రారంభించారు. అయితే టోర్నీ ప్రారంభించిన అనంతరం కఠువా ఘటనకి వ్యతిరేకంగా నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర వపన్‌ మెరుపు దీక్షకి దిగుదామని భావించిన పవన్ పోలీసులని అనుమతి కోరగా వారు నిరాకరించడంతో కేవలం నెక్లెస్ రోడ్ కి వచ్చి కాసేపు నిరశన ప్రదర్సన చేసి వెళ్ళిపోదామని భావించారు. అయితే అప్పటికే పవన్ అక్కడికి వస్తున్న విషయం పసిగట్టిన మీడియా ఆయన కారు దిగాడంతోనే ఆయన్ని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించింది.

అక్కడ మాట్లాడిన పవన్ కఠువా ఘటన చాలా బాధాకరమైనదని పవన్‌ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ముక్కుపచ్చలారని బాలికలపై దురాగతాలు జరుగుతున్నాయని… వీటిని అరికట్టేందుకు బలమైన చట్టాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఆదిలోనే తుంచాల్సిన అవసరం ఉందన్నారు పవన్. అలాగే ఆడ పిల్లల జోలికొస్తే తోలు తీయాలని, సింగపూర్‌ తరహాలో శిక్షలు అమలు చేయాలన్నారు. ఈ అత్యాచార ఘటన హృదయాలను కదిలించిందన్నారు. అత్యాచారం, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పనులు చేస్తే తీవ్రంగా చర్యలు ఉంటాయనే భయాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ తెలిపారు.

అలాగే హృదయం ద్రవించే ఇలాంటి ఘటనలకు కులాలు, మతాలు అంటగట్టడం సరికాదని ఢిల్లీలో జరిగితే తప్ప స్పందించే స్థాయిలో కేంద్రం లేదన్నారు. అర్ధరాత్రి ఆడది నడిరోడ్డులో తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు గాంధీజీ చెప్పారని… కానీ ఇప్పుడు పసిపిల్లలు కూడా పగలు బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శ్రీ రెడ్డి మీ మద్దతు కోరిందని ఒక విలేఖరి ప్రశ్నించగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు టీవీలకి వస్తే లాభం లేదని, కోర్టులలో, పోలిస్ స్టేషన్ లలో కేస్ వేసుకోమని సలహా ఇచ్చారు.

అత్యాచారం జరిగినప్పుడు పోలీస్ స్టేషనుకైనా వెళ్ళాలి లేదా లీగల్ గా నైనా ప్రొసీడ్ కావాలె తప్ప టీవీ చర్చల్లో కూర్చొని ఇలా సెన్సేషనల్ చేసుకోవడం వాళ్ళ లాభం లేదని అన్నారు. ఇలా అన్యాయం జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చే కంటే డైరెక్ట్ గా  పోలిస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చెయ్యాలే తప్ప మీడియాలో తమ తమ బాధలను వ్యక్తం చేయడం వల్ల ఆయా టీవీ ఛానెల్స్ టిఆర్ పి లు పెరగడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని పవన్ చెప్పారు. మీడియా అనేది ఒక మెసేజ్ పాస్ చేయడానికి  మాత్రమే పనికొస్తుందని మీడియా న్యాయం చేయలేదని ఆయన అన్నారు.