వ్యభిచారం చేసినట్లుగా ఒప్పుకున్న శ్రీరెడ్డిని అరెస్ట్‌ చేయాలి!

Tamil Actor Varahi Files Case against on Sri Reddy

తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద చర్చకు తెర లేపిన శ్రీరెడ్డి ఇటీవల తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై తెలుగు సినీ ప్రముఖులు పెద్దగా పట్టించుకోలేదు. ఎంతో మందిపై శ్రీరెడ్డి తనదైన శైలిలో విరుచుకు పడ్డా కూడా ఏ ఒక్కరు కూడా నోరు విప్పి ఆమెను విమర్శించిన దాఖలాలు లేవు. కాని తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మాత్రం శ్రీరెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నడిగర్‌కు చెందిన విశాల్‌ మరియు కార్తీలు శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసి, వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరిపైన అయినా ఫిర్యాదు ఉంటే పోలీసులకు చెప్పాని, అంతే తప్ప సినిమా ఇండస్ట్రీని మొత్తం బ్యాడ్‌ చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని వార్నింగ్‌ ఇచ్చారు.

తాజాగా తమిళ నటుడు వారాహి కూడా శ్రీరెడ్డిపై విరుచుకు పడ్డాడు. తమిళ స్టార్స్‌పై శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను వారాహి తప్పుబట్టాడు. తాను వ్యభిచారం చేశాను, ఇతరుతో పడుకున్నాను అంటూ స్వయంగా శ్రీరెడ్డి చెబుతుందని, అందుకే ఆమెను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ వారాహి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వారాహి ఇచ్చిన కొన్ని వీడియోలను కూడా తీసుకున్నారు. ఆ వీడియోల్లో తాను వ్యభిచారం చేసినట్లుగా ఒప్పుకున్నట్లుగా ఉంది. అందుకే ఆ వీడియోలను పరిశీలించి ఆమెను అరెస్ట్‌ చేయాలని వారాహి కోరుతున్నారు. మరి ఈ కేసుపై పోలీసులు ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. శ్రీరెడ్డి ఇంకా ఈ విషయమై ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వలేదు. వారాహిపై శ్రీరెడ్డి చాలా సీరియస్‌గానే రియాక్ట్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది.