సవ్యసాచిలో తమన్నా లేదట!

tamanna out of item song in savya sachi movie

నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. తాజాగా ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. తమన్నాకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చినట్లుగా సమాచారం అందింది. అయితే తమన్నా డేట్లు క్ల్యాష్‌ అవుతున్న కారణంగా ఆమెతో ఐటెం సాంగ్‌ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లుగా దర్శకుడు చందు మొండేటి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇక ఈ చిత్రం ఐటెం సాంగ్‌ ప్లేస్‌లో హీరో హీరోయిన్‌ల కాంబో పాటను పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

savya sachi movie

తమన్నా ఐటెం సాంగ్‌తో సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌ స్థాయి పెరుగుతాయని అంతా భావించారు. కాని తమన్నా ఐటెం సాంగ్‌ను తొలగించడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు. చైతూ మూవీలో తమన్నా ఉండి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా గతంలో ఐటెం సాంగ్స్‌ చేసిన పలు చిత్రాలకు మంచి మార్కెట్‌ దక్కింది. ఈ చిత్రంలో కూడా తమన్నా ఐటెం సాంగ్‌ చేస్తే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. త్వరలో శైలజా రెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చైతూ, నవంబర్‌లో సవ్యసాచి చిత్రంతో రానున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్రను నిన్నటి తరం హీరో పోషిస్తున్న విషయం తెల్సిందే.