దాసరి కుటుంబం ఆస్తి తగాదాలు

narayana rao properties issues

దాసరి నారాయణ రావు బతికి ఉన్నంత కాలం టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు. చిన్న చిత్రాలను ప్రమోట్‌ చేసేందుకు ఎప్పుడు ముందుండి అందరి మనిషి అనిపించుకున్న దాసరి నారాయణ రావు చనిపోయి సంవత్సరం అయ్యింది. అయినా ఇంకా ఆయన కుటుంబంలో ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాసరి నారాయణ రావు బతికి ఉన్న సమయంలోనే ఆయన పెద్ద కొడుకు భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానంటూ దాసరి నారాయణ రావు హామీ ఇచ్చాడట. కాని ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యులు ఆమెకు చెందవల్సిన ఆస్తులను ఇవ్వడం లేదట.

 dasari narayana rao properties issues

దాసరి చనిపోయిన సమయంలో మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసిన పెద్ద కోడలు సుశీల తాజాగా మరోసారి తన కొడుకుకు ఆస్తులు దక్కకుండా ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాసరి ఆస్తులన్ని కూడా ఆయన చిన్న కొడుకు అరుణ్‌ కుమార్‌ పేరుమీద ఉన్నాయి. దాంతో ఆస్తుల పంపిణీకి ఆయన ఒప్పుకోవడం లేదట. పలు కీలకమైన ఆస్తులన్ని కూడా అరుణ్‌ పేరుపై ఉండటంతో సుశీల అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తమకు తెలియకుండా ఆస్తులు ఆయన వశం చేసుకున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు మరియు సినీ వర్గాల వారు ఎంటర్‌ అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. దాసరి ఆత్మ ఈ గొడవలతో కలత చెందుతూ ఉంటుందని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.