బాలయ్య పటాస్‌కు ఏర్పాట్లు?

balakrishna

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో ‘అతనొక్కడే తర్వాత సక్సెస్‌ కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎట్టకేలకు ఆయన ఎదురు చూపులు ‘పటాస్‌’ చిత్రంతో ముగిశాయి. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పటాస్‌ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రంతో కళ్యాణ్‌ రామ్‌తో పాటు అనీల్‌ రావిపూడికి కూడా మంచి పేరు వచ్చింది. ఆ చిత్రం తర్వాత ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో మరో విజయాన్ని దర్శకుడు అనీల్‌ రావిపూడి దక్కించుకున్నాడు. రాజా ది గ్రేట్‌ సమయంలోనే బాలయ్యతో అనీల్‌ రావిపూడి సినిమా గురించి ప్రచారం జరిగింది. గతంలో అనీల్‌ రావిపూడి ఒక కథను బాలయ్యకు వినిపించడం జరిగింది. ఆ కథతో సినిమాను చేయాలని బాలయ్య భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ఆ చిత్రం వర్కౌట్‌ కాలేదు.

balakrishna next movie with anil ravipudi

‘రాజా దిగ్రేట్‌’ చిత్రం తర్వాత అనీల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 2’ అనే మల్టీస్టారర్‌ మూవీని మొదలు పెట్టాడు. వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ల కలయికలో దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సమయంలోనే అనీల్‌ రావిపూడికి బాలయ్య నుండి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత సినిమా చేద్దాం అంటూ అనీల్‌ రావిపూడికి బాలయ్య నుండి సందేశం అందినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి బాలయ్యతో చేసే అవకాశం మనోడు అనీల్‌ దక్కించుకున్నాడు. అనీల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 2’ మరియు బాలయ్య ‘ఎన్టీఆర్‌’ చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి వారి చిత్రాలతో పోటీ పడి, ఆ వెంటనే కలిసి ఒక చిత్రాన్ని చేయబోతున్నారన్న మాట.