ఇది బాలయ్యపై కక్ష సాధింపే..!

Mammootty Yatra movie release on Sankranthi

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ఎప్పుడో నిర్ణయించారు. రెండు నెలల క్రితమే ‘ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలపై బాలకృష్ణ మరియు దర్శకుడు క్రిష్‌లు క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ విడుదలతో పాటు సంక్రాంతికి రామ్‌ చరణ్‌, బోయపాటిల మూవీ, వెంకీ, వరుణ్‌ల మల్టీస్టారర్‌ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతికి జాబితా పెద్దగానే ఉంది. దాంతో సంక్రాంతికి అంటే ఇకపై కొత్త సినిమాల ప్రకటన ఉండదు అని అంతా భావిస్తున్న సమయంలో ‘యాత్ర’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

మాజీ సీఎం, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మమ్ముటి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ఈ చిత్రానికి మహి రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ వరకు పూర్తి చేయబోతున్నారు. అయితే సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం అయితే నవంబర్‌ లేదా డిసెంబర్‌లో విడుదల చేయాలి. కాని ఎన్టీఆర్‌ చిత్రంపై పోటీగా రావాలనే ఉద్దేశ్యంతో యాత్రను ఆలస్యం చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణపై కక్ష కట్టి ఇలా కొందరు యాత్రను సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు, బాలకృష్ణకు యాత్ర వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ నందమూరి ఫ్యాన్స్‌ అంటున్నారు. యాత్ర సంక్రాంతికి విడుదల కావడం వెనుక వైకాపా హస్తం ఉందనే వారు కూడా ఉన్నారు.