బౌన్సర్ల మధ్య తూటాలకి ఎదురొడ్డుతావా పవన్ ?

తనకు అనుభవం లేదంటూ ప్రత్యర్ధి పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ ఒక్కసారిగా విచక్షణ కొక్పోయారు. “పుట్టగానే ఎవరూ రాజకీయాల్లోకి రారు కురువృద్ధులుగా పుడతారా”.. అంటూ పార్టీ కార్యకర్తల ముందు ఆవేశ పడిపోయారు. “అనుభవం వస్తుంది. కిందా, మీద పడతాం. లేస్తాం. అప్పుడు చూపిస్తాం. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం” అని పిడికిలి బిగించి గాల్లో చేయి విసిరారు. బలవంతంగా భూములు లాక్కుంటే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బలవంతపు భూసేకరణకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకుంటే పోరాటం చేస్తాని చెప్పారు. రైతుల తరపున పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తుపాకీ కాల్పులు జరిపినా ఎదురొడ్డి నిలబడతానన్నారు. ‘ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని.. మీకు నేను అండగా ఉంటాను’ అని రైతులకు పవన్‌కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కాల్పులకు పాల్పడితే.. బషీర్‌బాగ్‌లో రైతుల మీద కాల్పులు జరిపినప్పుడు ఏమైందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రైతులు హాయిగా గుండెల మీద చేయి వేసుకుని పడుకోవచ్చని… రైతుల తరపున పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇంత వరకూ బాగానే ఉన్నా పవన్ చేస్తున్న వ్యాఖ్యలని చూసి సామాన్య జనం మాత్రం నవ్వుకున్నారు.

దేనికంటే తన బౌన్సర్లు(ఆయన వ్యక్తిగత సెక్యురిటీ) ఆరోగ్యం బాలేదని రెండ్రోజులు, వారు పండగ చేసుకోవాలని పది రోజులు ఇలా వారు లేకుండా ఒక పూట బయటకు కూడా రాని మనిషి ఇప్పుడు ప్రభుత్వ తూటాలకి ఎదురొడ్డి నిలుస్తాననడం హాస్యాస్పదంగా ఉంది. మామూలుగా అన్ని ఊర్లలో ఆవుల మందలు ఉంటాయి. అవి శ్రీ కాకుళం జిల్లాలో కాస్త ఎక్కువ ఉంటాయి. అయితే ఆ ఆవుల మందలు ఉన్న రోడ్ల మీద రోడ్ షోలు చేస్తుంటే ఎవరో వాటిని కొట్టడమో బెదరకోట్టదమో చేస్తే దానికే టీడీపీ ఆవులను మీదకి తోలుతుందన్న మనిషి రేపు తూటాలకి ఎదురొడ్డి నిలుస్తాననడం నిజంగా నవ్వు తెప్పించే అంశమే.

ఇప్పుడు తాజాగా పవన్ చేసిన మరో వ్యాఖ్య మరింత నవ్విస్తోంది. అసలు ఏ మాత్రం హోం వర్క్ లేకుండా పవన్ ఎద్నుకు ఇలా మాట్లాడి పరువు తీసుకున్తున్నడా అనిపిస్తోంది. ఆ వ్యాఖ్య ఏమిటంటే తనకు పది మంది ఎంపీలుంటే.. జగన్మోహన్ రెడ్డిలా పారిపోకుండా అసెంబ్లీలోప్రభుత్వాన్ని నిలదీసేవాడట. ఆయనే చెప్పుకున్నారు. ఆయన అలా అనడం ఆలస్యం ఆయన అభిమానులంతా ఈలలు,గోలలు చేసి హంగామా చేశారు. దానికి పవన్ కూడా సంతోష పడిపోయారు. ఎంపీలు పార్లమెంట్‌లో ఉంటారని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారని ప్రతి చిన్న పిల్లవాడికీ తెలుసు కానీ పవన్ కల్యాణ్ కు మాత్రమే తెలియదు. ఇదొక్క సంఘటనే కాదు ఫ్రాన్క్లిన్ టెంపుల్టన్ లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాజకీయం ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూనే ఉంది. ఎప్పుడో ఓ సారి బయటకు వచ్చి మాటలు చెబితే రాజకీయం అయిపోదు. ఏ మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేయడం అంత కన్నా కాదు.