నటనకు సై… పట్టించుకుంటారా?

Renu Desai annonces to again act in movies after second marriage

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్న రేణుదేశాయ్‌ రెండు మూడు నెలల్లో వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతుంది. సినిమాల్లో హీరోయిన్‌గా పరిచయం అయ్యి, ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌తో ప్రేమలో పడి, ఆయనతో సహజీవనం చేసి, ఆ తర్వాత వివాహం కూడా చేసుకున్న రేణుదేశాయ్‌ కొన్నాళ్ల క్రితం పవన్‌ నుండి విడిపోయింది. పవన్‌ నుండి విడిపోయిన తర్వాత మరాఠి సినిమాలను నిర్మిస్తూ, ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించింది. అయితే గత కొన్నాళ్లుగా పిల్లలతో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు దూరంగా ఉంది. పెళ్లి తర్వాత మళ్లీ నటనపై దృష్టి పెడతాను అంటూ చెప్పుకొచ్చింది.

తనకు ఇప్పుడు, ఎప్పుడు నటన అంటే చాలా ఆసక్తి అని, చిన్నతనంలో కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ నటిని అయ్యాడు. అయితే కొన్ని కారనాల వల్ల నటిగా కొంత కాలం మాత్రమే కొనసాగాను. అందుకే ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను, అందుకు నాకు కాబోయే భర్త కూడా ఓకే చెప్పాడు. నటిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడం వల్లే తాను మళ్లీ నటించాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే రేణుదేశాయ్‌ నటిస్తాను అంటే మాత్రం ఆమెకు అవకాశాలు వస్తాయా అనేది అనుమానమే. రేణుదేశాయ్‌ తెలుగులో క్రేజ్‌ ఉన్న నటి, కాకుంటే తెలుగులో ఈమెకు ఛాన్స్‌లు ఇచ్చే సాహసం తెలుగు నిర్మాతలు చేయరు. ఎందుకంటే ఈమె పవన్‌ మాజీ భార్య కనుక. పవన్‌ మాజీ భార్య వేరే సినిమాలో నటిస్తే మెగా ఫ్యాన్స్‌ ఊరుకోరు. అందుకే మెగా ఫ్యాన్స్‌కు భయపడి ఈమెకు ఛాన్స్‌లు ఇవ్వరు. ఇక ఇతర భాషల్లో ఈమె నటిగా అవకాశాలు దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.