టీజర్‌తోనే దుమ్ము లేపేశాడు

Geetha Govindam Movie teaser

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక ఊపు ఊపేస్తున్నాడు. అర్జున్‌ రెడ్డితో ప్రేక్షకులను మైమరపించిన ఈయన తాజాగా ‘గీత గోవిందం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు ‘ట్యాక్సీవాలా’ సిద్దం అయినప్పటికి ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ముందుగా దీన్ని తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. ఈ సమయంలోనే గీత గోవిందం చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయడం జరిగింది. టీజర్‌తో సినిమా ఎలా ఉండబోతుందో తేల్చి చెప్పారు.

యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యే కంటెంట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురాం తెరకెక్కించాడు. తప్పకుండా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉన్న ప్రేక్షకులు టీజర్‌ చూసిన తర్వాత అంచనాలను మరింతగా పెంచేసుకుంటున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రంపై ఉన్న అంచనాలను ఈ చిత్రం నిలుపుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. ఈ చిత్రంలో కూడా విజయ్‌ దేవరకొండ యూత్‌ ఐకాన్‌గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణాత్మక పనులు జరుగుతున్నాయి. టీజర్‌ విడుదలైన తర్వాత సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. అర్జున్‌ రెడ్డి స్థాయిలో ఈ చిత్రం సక్సెస్‌ కావడం ఖాయం అంటూ విజయ్‌ దేవరకొండ నమ్మకంగా ఉన్నాడు.