ఎన్టీఆర్ లో బాబాయి పాత్రపై అబ్బాయి క్లారిటీ…!

Balakrishna Does Not Play A Role In NTR Biopic

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో దర్శకుడు క్రిష్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే సినిమా పై అంచనాలను పెంచేసింది. నందమూరి ఫాన్స్, సగటు ప్రేక్షకుడు కూడా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ గురుంచి ఇప్పటి జనరేషన్ కు తెలియాలని ఒక్కనోక్క సందర్బంలో బాలకృష్ణ అన్నారు. అందుకే అయన పేరుతో బయోపిక్ రూపొందించాడు. ఇక ఈ చిత్రంలో దాదాపుగా స్టార్ హీరోస్ అందరు నటించిన సంగతి తెలిసిందే. టిజర్ అండ్ వీడియో రూపంలో మనకు ఒక్కొక్కటిగా విడుదల చేశారు. కానీ ఒక్కలోటు మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది అదే నందమూరు తారకరామారావు సినిమా రాజకీయ వారసుడిగా చెప్పుకున్న బాలకృష్ణ ను మాత్రం ఎక్కడ చూపించలేదు. చిన్నతనంలో ఉన్న బాలకృష్ణ మాత్రం చూపించాడు క్రిష్ అంతే తప్ప మరల ఎక్కడ బాలకృష్ణ ను చూపించిన ప్రయత్నం చెయ్యలేదు.

కళ్యాణ్ రామ్ ఒకానొక్క సందర్బంలో కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. తారక్ గురుంచి ప్రస్తావన వచ్చినప్పుడు అవసరం లేదు కాబట్టే బాబాయ్ పాత్రను చూపించలేదు అన్నాడు. అంటే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ పాత్ర లేదని తేల్చి చేపేశాడు. కానీ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నపుడు బాలకృష్ణను సినిమాలోకి తీసుకువచ్చి ఓ ఐదు, ఆరు సంవత్సరాలు అండగా నిలబడిన ఎన్టీఆర్ ఆ తరువాత మంగమ్మ గారి మనవడు చిత్రంతో సొంత కాళ్ళ మీద నిలబడుతూ వచ్చాడు. అండగా సినిమాలో ఉన్నవరకు ఓ రెండు మూడు సిన్స్ అయినా చుపించాలిసింది. మరి బాలకృష్ణ ఫాన్స్ ఎన్టీఆర్ పాత్రలో లేకపోవడాని ఏలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సినిమా మొత్తనా బాలకృష్ణ ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ పాత్ర ఉంటె భాగుండని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా కళ్యాణ్ రామ్, హరి కృష్ణ పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ మహానాయకుడిలో కళ్యాణ్ రామ్ ను పూర్తిగా చూడవచ్చు. ఎన్టీఆర్ కథానాయకుడిలో కళ్యాణ్ రామ్ పాత్ర తక్కువే అని చెప్పాలి