వైసీపీలోకి అలీ…ముహూర్తం రెడీ…!

Tollywood Actor And Comedian Ali To Join YSRCP Party

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీలో చేరిక ఖరారయ్యింది. జనవరి 9న జగన్ పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటు చేస్తున్న భారీ సభలో జగన్ సమక్షంలో అలీ వైసీపీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల డిసెంబర్ 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్ ను అలీ కలిశారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆకాంక్షను జగన్ వద్ద వ్యక్తపరిచారు. అలీ రాజమండ్రికి చెందిన వ్యక్తి కావడంతో… ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

అలీ సినీ గ్లామర్ పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. మరోవైపు, పార్టీ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అలీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అలీ 2014లో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కాని అప్పటి రాజకీయ పరిణామాలతో అది కుదరలేదు. తర్వాత జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. పవన్‌ తో కలిసి నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు వెళ్లడంతో జనసేన తరపున పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. రాజమండ్రి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. తర్వాత అలీ జగన్‌ను కలవడంతో పవన్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులతో ట్రోల్ చేశారు.