తమన్నా ఇక వాటిని చేసుకోవాల్సిందేనా?

tamanna-will-do-item-songs-in-the-future

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మిల్కీబ్యూటీ తమన్నా టాలీవుడ్‌లోని దాదాపు స్టార్‌ హీరోలందరితో కూడా నటించేసింది. ఇటీవలే ఈ అమ్మడు ‘బాహుబలి’ సినిమాలో అవంతిక పాత్ర పోషించింది. ప్రతిష్టాత్మక సినిమాలో ముఖ్య పాత్రను పోషించినప్పటికి ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కెరీర్‌ డల్‌ అవుతున్న సమయంలో బాహుబలిలో ఛాన్స్‌ రావడంతో ఆనందంతో గంతేసిన తమన్నాకు ఆ సినిమా విడుదల తర్వాత అవకాశాలు రాకపోవడంతో అవాక్కవుతుంది. తమిళంలో అయినా ఛాన్స్‌లు వస్తాయేమో అని అటుగా ప్రయత్నించింది. అక్కడ కూడా చిన్నా చితకా సినిమాల్లో తప్ప అవకాశాలు దక్కించుకోలేక పోయింది.

ఇటీవల తమన్నా ‘జైలవకుశ’ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసింది. ఈ అమ్మడు చేసిన స్వింగ్‌జర ఐటెం సాంగ్‌ మాస్‌ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. ఐటెం సాంగ్‌లో ప్రొఫెషనల్‌ ఐటెం గర్ల్‌ మాదిరిగా మాస్‌ స్టెప్పులు వేసి, హాట్‌ కాస్ట్యూమ్స్‌తో అదరగొట్టింది. ఈ ఐటెం సాంగ్‌ కోసం తమన్నా కాస్త ఎక్కువ పారితోషికమే తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ పాట తర్వాత అయినా ఈమెకు అవకాశాలు వస్తాయని కొందరు భావించారు. కాని ఈమెకు వచ్చే అవకాశాలు ఐటెం సాంగ్‌లే అని, హీరోయిన్‌గా తమన్నాకు ఇక ఛాన్స్‌లు రానట్లే అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. మరో ఒకటి రెండు సంవత్సరాలు తమన్నా ఐటెం సాంగ్స్‌ చేసి ఆకట్టుకుని, ఆ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సిందే అని సినీ వర్గాల వారు అంటున్నారు.