తమన్నాను పొగరు పట్టిందా అని తిట్టిన అభిమాని.. తమన్నా సమాధానం?

fan controversial tweet to Tamannaah Bhatia in twitter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మిల్కీబ్యూటీ తమన్నా తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా కొన్ని సంవత్సరాల ముందు వరకు దూసుకు పోయింది. అయితే ఇటీవల ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ముఖ్యంగా తెలుగులో ఈమెకు సినిమాలు కరువయ్యాయి. తాజాగా ఈమె ‘క్వీన్‌’ రీమేక్‌లో నటించేందుకు కమిట్‌ అయ్యింది. ఆ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. వచ్చే సంవత్సరంలో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘బాహుబలి’ తర్వాత తమన్నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన సినీ వర్గాల వారు ఆశ్చర్యపోయేలా ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇక తాజాగా ఆమెకు సోషల్‌ మీడియాలో ఒక అభిమాని షాక్‌ ఇచ్చాడు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ తమన్నా ఇటీవల లైవ్‌ చాట్‌ చేసింది. అభిమానులు మరియు మిత్రులతో ట్విట్టర్‌ ద్వారా చాట్‌ చేసింది. ఆ సందర్బంగా తమన్నా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. తమన్నాకు ఒక అభిమాని పదే పదే ఒక ప్రశ్నను సంధించాడు. అయితే తమన్నా మాత్రం ఆ ప్రశ్నను చదవలేదు. దాంతో అతడికి కోపం వచ్చి తెల్లగా ఉన్నావని పొగరా, నాకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అంటూ లైవ్‌లోనే తిట్టాడు. అందుకు తమన్నా విభిన్నంగా స్పందించింది.

అభిమానికి సమాధానంగా.. అయ్యో, నాకు పొగరు ఏమీ లేదండి, మీకు నమస్కారం, మీకు మీ కుటుంబ సభ్యులకు జీవితాంతం శుభం కలగాలని కోరుకుంటున్నాను అంటూ తమన్నా చేసిన ట్వీట్‌కు సదరు అభిమాని ఖుషీ అయ్యాడు. ఈ చాట్‌లో తనకు డాన్స్‌ ప్రధానమైన సినిమాలు చేయాలని కోరిక ఉందని, త్వరలోనే తెలుగులో మరో సినిమాను స్టార్‌ హీరోతో కలిసి చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి రాకుంటే ఏం చేసేవారు అనే ప్రశ్నకు సమాధానంగా సినిమాలు లేకుండా నా జీవితాన్ని ఇప్పుడు ఊహించుకోలేక పోతున్నాను. ఏం అయ్యేదాన్నో నేను చెప్పలేను అంటూ తమన్నా అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.