మోడీ పేరెత్తే దమ్ముందా ?

Raghuveera Reddy comments on Ys Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్రత్యేక హోదా డిమాండ్ తో అనంతపురంలో వైసీపీ అధినేత యువభేరి తలపెట్టడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. నిజానికి హోదా ఇవ్వాల్సిన మోడీకి మద్దతు ఇచ్చిన జగన్ ఇప్పుడు రాజకీయం కోసమే ఈ నాటకం ఆడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఆరోపించారు. ఇప్పుడైనా అనంత యువభేరి లో మోడీ పేరు ఎత్తే దమ్ము జగన్ కి ఉందా అని రఘువీరా నిలదీశారు. రఘువీరా లేవనెత్తిన అంశాల్లో కొన్ని బులెట్ పాయింట్స్ మీ కోసం.

రఘువీరారెడ్డి… కామెంట్స్..పీసీసీ చీఫ్

  • వైసీపీ యువuభేరి లక్ష్యం ఏంటి… హోదా కోసమా… రాజకీయ లబ్ది కోసమా…
  • హోదాపై మోసం చేసిన మోడీకి జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారు..?
  • ప్రజలను మభ్య పెట్టడానికే జగన్ యువభేరి…
  • హోదా కోసం ఎంపీల రాజీనామా ఏమయ్యింది..?
  • హోదా పోరాటంలో జగన్ మాట తప్పినట్టా..? మడం తిప్పినట్టా..?
  • హోదా ఇవ్వకుండా మోడీ చేసిన మోసాన్ని యువభేరిలో ప్రస్తావించే దమ్ము ధైర్యం జగన్ కు ఉందా..?
  • మోడీతో జగన్ కుమక్కయ్యి… హోదా విషయంలో రాజీ పడ్డారు…
  • బీజేపీతో వైసీపీ కుమక్కు అవడం పెద్ద ద్రోహం…
  • రాష్ట్రానికి ద్రోహం చేసినవారిలో బీజేపీ టీడీపీతో పాటు వైసీపీకూడా చేరబోతుంది…
  • ఏపీ హోదా ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం…
  • కాంగ్రెస్ పార్టీకే హోదా ఇచ్చే చిత్తశుద్ధి ఉంది…