నానితోనే కాకుండా ధనుష్‌తో కూడా..!

tamil actor dhanush to direct nagarjuna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎక్కువ మంది హీరోలు మల్టీస్టారర్‌ చిత్రాలు తాము సిద్దం అంటూ ప్రకటనలు చేస్తారు. కాని వారిలో ఎక్కువ శాతం మంది మల్టీస్టారర్‌లో ఇతర హీరోలతో స్క్రీన్‌ను షేర్‌ చేసుకునేందుకు ఆసక్తిని కనబర్చరు. నాగార్జున మాత్రం మల్టీస్టారర్‌ చిత్రాలను కంటిన్యూగా చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. ‘ఊపిరి’లో కార్తీతో కలిసి నటించిన నాగ్‌ త్వరలో నానితో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. నానితో మల్టీస్టారర్‌ గురించి చర్చలు జరుగుతున్న ఈ సమయంలోనే నాగార్జున మరో హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ఆ చిత్రంలో ధనుష్‌ ఒక హీరోగా నటించనున్నాడు. తెలుగు వర్షన్‌లో ధనుష్‌తో కలిసి నాగార్జున నటించబోతున్నాడు. తమిళ వర్షన్‌లో వేరే అక్కడ సీనియర్‌ హీరో నటించే అవకాశం ఉంది. హీరోగానే కాకుండా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ధనుష్‌ చెప్పిన స్క్రిప్ట్‌ నాగార్జునకు నచ్చిందని, అందుకే ధనుష్‌ దర్శకత్వంలో నటించేందుకు కింగ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ అక్కినేన వర్గాల నుండి సమాచారం అందుతుంది. మొత్తానికి నాగార్జున వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలకు కమిట్‌ అవుతూ ఇతర సీనియర్‌ హీరోలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు.