‘భాగమతి’ సేఫ్‌ అయ్యిందా?

bhaagamathie movie box office collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనుష్క ప్రధాన పాత్రలో అశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ‘భాగమతి’ చిత్రం భారీ అంచనాల నడుమ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. 2018 మొదటి టాలీవుడ్‌ సక్సెస్‌ను ‘భాగమతి’ అందుకోబోతుందని అంతా భావించారు. కాని ఫలితం తారు మారు అయ్యింది. ఆశించిన రేంజ్‌లో ‘భాగమతి’ ఆకట్టుకోలేక పోయింది. అనుష్క గతంలో నటించిన ‘అరుంధతి’ రేంజ్‌లో ఉంటుందని ఆశించారు. కాని ఓంకార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రాజు గారి గది’ చిత్రానికి కాపీలా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఇతర పెద్ద సినిమాలు పోటీగా లేకపోవడంతో పాటు, ఏ ఒక్కటి కూడా ఆకట్టుకునే సినిమాు రాకపోవడంతో ‘భాగమతి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పరువు నిలుపుకుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘భాగమతి’ చిత్రం కోసం నిర్మాతలు 35 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా ఆ మొత్తం వచ్చింది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవడం ఖాయం అని అంతా భావించారు. కాని సెలవులు మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాకు మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. నిర్మాతలతో పాటు ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన అన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా సేఫ్‌ జోన్‌లోకి వెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. ఓవర్సీస్‌లో మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసిన ‘భాగమతి’ తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించింది. కాని తమిళం మరియు మలయాళంలో మాత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. మొత్తంగా అనుష్క తన బ్రాండ్‌ ఇమేజ్‌తో యావరేజ్‌ సినిమాకు కూడా మంచి కలెక్షన్స్‌ను రాబట్టగలిగింది.