దాసరికి మరో ఛాన్స్‌

Dasari Arun Kumar To Play villain role in sailaja reddy alludu movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణ రావు తనయుడు దాసరి అరుణ్‌ కుమార్‌ హీరోగా పరిచయం అయ్యి సక్సెస్‌ కాలేక పోయాడు. కొడుకు కోసం చాలా ప్రయత్నాలు చేసిన దాసరి నారాయణ రావు తన వల్ల కాదని వదిలేశాడు. హీరోగా పలు చిత్రాల్లో నటించిన అరుణ్‌ ఒక్క సక్సెస్‌ను కూడా దక్కించుకోలేక పోయాడు. సినిమా పరిశ్రమపై ఉన్న అభిమానంతో హీరోగా కాకున్నా కనీసం విలన్‌గా అయినా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవలే అల్లు శిరీష్‌ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ చిత్రంలో దాసరి అరుణ్‌ కుమార్‌ విలన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో దాసరి పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. దాంతో ఆ చిత్రం ఒకటి దాసరి అరుణ్‌ చేసినట్లుగా కూడా ఎవరు గుర్తించలేదు.

దాసరి అరుణ్‌కు విలన్‌గా రెండవ ఛాన్స్‌ దక్కింది. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘శైలజరెడ్డి అల్లుడు’ అనే చిత్రంలో నాగచైతన్యకు అవకాశం దక్కింది. ఆ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు మారుతి చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. వరుసగా విజయాలను అందుకుంటూ వస్తున్న మారుతి తాజాగా ‘మహానుభావుడు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇలా వరుస విజయాలతో దూసుకు పోతున్న మారుతి దర్శకత్వంలో విలన్‌ పాత్ర చేయడం వల్ల దాసరి అరుణ్‌కు మంచి పేరు వస్తుందనే నమ్మకం సినీ వర్గాల్లో కూడా వ్యక్తం అవుతుంది. ఎన్నో అద్బుత చిత్రాలు తెరకెక్కించి, ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు దాసరి నారాయణ రావు తనయుడికి ఇప్పుడు కెరీర్‌లో నిలదొక్కుకోవడం కష్టంగా మారిందని సినీ పరిశ్రమలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.