తమిళ “అత్తారింటికి దారేది” టీజర్ టాక్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం మంచి విజయంను సాదించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను తిరగా రాసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే చాలా గొప్ప చిత్రం గా నిలిచిపోతుంది. ఇపుడు ఈ చిత్రాని తమిళంలో సి సుందర్ దర్శకత్వంలో, శింబు హీరో గా ‘వంత రాజవతాన్ వరువేన్’ అనే పేరు తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇటివల టిజర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలను చూపుతూ టీజర్ సాగింది. ఈ టిజర్ లో శింబు నటన అద్బుతంగా ఉన్నది. చాలా డబ్బు ఖర్చు చేసి చాలా రిచ్ గా సినిమాను తీశారు.

తమిళ "అత్తారింటికి దారేది" టీజర్ టాక్ - Telugu Bullet

తెలుగు లో అత్తారింటికి దారేది చిత్రంలో పవన్, అలీ ల మద్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎ విధంగా ఆకట్టుకున్నాయో, అదే విధంగా తమిళంలో శింబు, యోగి బాబు మద్య వచ్చే కామెడీ కూడా అదేవిధంగా ఆకట్టుకునేలా ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో శింబు కి అత్త గా రమ్య కృష్ణ నటిస్తున్నారు. శింబు సరసన కేథరిన్, మేఘ ఆకాష్ నటిస్తున్నారు. టీజర్ చూస్తుంటే శింబు కెరీర్ లో మరో హిట్ట్ చేరడం కాయం అని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేది ని ప్రకటిస్తాం అని లైక ప్రొడక్షన్స్ వారు చెబుతున్నారు.