బిగ్‌బాస్‌లో మసాలా పెరిగింది, కాని..!

Tanish and Nutan naidu Fighting in Bigg Boss telugu season 2

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అయ్యింది. మొదటి వారంలో పార్టిసిపెంట్స్‌కు ప్రేక్షకులు అలవాటు పడాలని, అందుకు కాస్త సమయం పడుతుందని నిర్వాహకులు అనుకున్నారు. అయితే షోలో సెలబ్రెటీలు లేక పోవడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు అంటూ నిర్వాహకులు భావించారు. అందుకే రెండవ వారం నుండి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు మసాలా కాస్త ఎక్కువ దట్టించాలని భావించారు. అందుకోసం కొన్ని కాంట్రవర్సీలను కూడా స్వయంగా సృష్టిస్తున్నారు.

తాజాగా తనీష్‌ మరియు నూతన్‌ నాయుడు ఇంకా ఇతర కుటుంబ సభ్యుల మద్య విభేదాలు తలెత్తడం అందరికి తెల్సిందే. వీరి విభేదాల వెనుక బిగ్‌బాస్‌ నిర్వాహకులు వ్యూహం ఉందని, అయితే ఇది సహజంగా లేదని, క్రియేట్‌ చేసిన గొడవలు అన్నట్లుగానే ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో వేస్తున్న మసాలా ప్రస్తుతం షోను హైలైట్‌ చేయడంలో విఫలం అవుతుంది. బిగ్‌బాస్‌ రెండవ వారం ఎలిమినేషన్‌ అయిన తర్వాత అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి. నాని నేడు రేపు ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్‌ చేస్తాడో చూడాలి. హౌస్‌లో రెండవ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కూడా త్వరలోనే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.