వీర్రాజు లెవెల్ ఏంటో తేల్చేసిన టీడీపీ.

TDP MLC Budda Venkanna Strong Counter Attack To MLC Somu Veerraju
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చీటికీమాటికీ సిఎం చంద్రబాబు మీద నోరు పారేసుకువడం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకి అలవాటు అయిపోయింది. ఆయన కామెంట్స్ కి టీడీపీ నాయకులంతా రియాక్ట్ కావడంతో సోము తనని తాను పెద్ద లీడర్ గా వూహించుకుంటున్నాడు. కనీసం వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేనన్న విషయం మరిచిపోయినట్టున్నాడు పాపం. అందుకే ఇకపై సోము కామెంట్స్ మీద పెద్దగా రియాక్ట్ కాకూడదని టీడీపీ డిసైడ్ అయ్యింది. సోము స్థాయిలో ఓ టీడీపీ ఎమ్మెల్సీ తో కౌంటర్ ఇప్పించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టే బుద్ధా వెంకన్నని రంగంలోకి దించింది. ఆయన ఓ రేంజ్ లో సోముని ఆటాడేసుకున్నారు.

బుద్ధా కామెంట్స్ లో హైలైట్స్ మీ కోసం…
 • రాం గోపాల్ వర్మ స్కైప్ లో డైరెక్షన్ చేసినట్టు , ప్రకాశం జిల్లా నుండి జగన్ స్కైప్ లో డైరెక్షన్ చేస్తున్నాడు..
 • జగన్ స్క్రిప్ట్ సోము వీర్రాజు చదువుతున్నాడు…
 • వైసీపీ ఏజెంట్ గా సోము వీర్రాజు పని చేస్తే , కేంద్రానికి కోవర్టుగా జగన్ పనిచేస్తున్నాడు..
 • తిరుపతిలో హోదా ఇస్తా అన్న క్లిప్పింగ్స్ కూడా సోము బయటకి చూపించాలి…
 • బిజెపి మమ్మల్ని మోసం చేస్తుంది అని కల్లో కూడా ఉహించలేక పోయాం..
 • రాష్ట్రము కోసం ప్రధాని పదవిని కూడా తృణప్రాయంగా వదిలిన గొప్ప వ్యక్తి చంద్రబాబు.
 • మాకు రాష్టం ముఖ్యంగాని పదవులు కాదు..
 • బిజెపి నాయకులకు రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమా?? పదవులు ముఖ్యమా….
 • పొత్తు వల్లే మీకు పదవులు వచ్చాయి.. అది మర్చిపోకండి..
 • మైనార్టీ సోదరులు అందరూ ఈ రాష్టానికి అండగా నిలవాలి..
 • రాష్ట్రనికి అన్యాయం జరిగితే చంద్రబాబు చూస్తూ ఊరుకోరు..
 • చంద్రబాబు ని టార్గెట్ చేసి నిందించడం సూర్యుడు మీద బురద జల్లటమే.. అది మీ మీదే పడుతుంది..
 • ముస్లింలు చంద్రబాబుకి బాసటగా నిలవాల్సిన సమయం ఇది..
 • ఐఏఎస్ లను అయ్యా ఎస్ అని చేసింది జగన్….