వైసీపీ పాలనపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు

వైసీపీ పాలనపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఏపీ రాజకీయాలలో ఇంకా వేడి మాత్రం తగ్గలేదనే చెప్పాలి. వైసీపీ పాలనపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటే, వైసీపీ నేతలు ఆ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ శ్రేణులు కూడా గట్టిగానే సమాధానమిస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు గుప్పించారు.

అయితే రియల్ ఎస్టేట్ ధరలు తగ్గడంతోనే చంద్రబాబునాయుడు ఇటీవల రాజధాని పర్యటన చేశారని అన్నారు. అంతేకాదు ఇసుక, ఇంగ్లీష్ మీడియం రికార్డులు అరిగిపోయాక ఇప్పుడు ఉల్లిపాయల మీద పడ్డారని ఎద్దేవా చేశారు. ఇ, ఇ, ఉ తరువాత చంద్రబాబు దేని మీద ఎగిరిపడతారో అని సెటైర్లు వేశారు. ఇకపోతే చంద్రబాబు అనుచరుడు పవన్ కళ్యాణ్ ఒక ప్కాకేజీ స్టార్ అంటూ ఫైర్ అయ్యారు.